తెలంగాణలో ముందస్తుపై ఈసీ కీలక వ్యాఖ్యలు

Updated By ManamFri, 09/07/2018 - 14:19
Chief election commissioner OP rawat
Elections in Telangana might not necessarily be held along with other four states

న్యూఢిల్లీ : తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం అసెంబ్లీ రద్దయితే వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, ఆరు నెలల పాటు ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ మాట్లాడుతూ.. నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు తెలంగాణలోనూ ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తామని  తెలిపారు. రద్దైన అసెంబ్లీకి మొదటి ప్రాధాన్యంలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు.   

మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ శుక్రవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో భేటీ కానున్నారు. తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీతో ఆయన సమావేశం అవుతారు. అలాగే ఈరోజు సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం భేటీ జరుగనుంది. నాలుగు రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలపై సీఈసీ చర్చించనుంది. కాగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో ఈ ఏడాది డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

English Title
Elections in Telangana might not necessarily be held along with other four states
Related News