రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు

Updated By ManamThu, 03/15/2018 - 01:24
kishan reddy
  • ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పాలన

  • ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్నారు

  • గవర్నర్ ప్రసంగంలో సమస్యల ప్రస్తావనేది?

  • ధన్యవాద తీర్మానంపై చర్చలో కిషన్‌రెడ్డి

kishan reddyహైదరాబాద్: తెలంగాణలో ప్రజాస్వా మ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తుందని బీజేపీ శాసనసభపక్షనేత జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొందని, మందకృష్ణమాదిగను కావాలనే రెండుసార్లు అరెస్టు చేశారని పేర్కొన్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం గతంలో 29 పేజీలు ఉంటే.. ప్రస్తుతం 18 పేజీల ప్రసంగానికి తగ్గిందన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయని, ఒక్క టీఆర్‌ఎస్ మాత్ర మే పాల్గొందనే భావన ప్రభుత్వానికి సరికాదని గుర్తు చేశారు. బంగారు తెలంగాణ సాధన దిశగా సభ్యులు సాగాలని గవర్నర్, సీఎం చెబుతున్నా రని.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం బంగారు తెలంగాణ అవుతుందా అని ప్రశ్నించారు. ధర్నాలు, నిరసనలు తెలిపే హక్కు తెలంగాణలో లేకుండా చేశారని, ప్రజా, విద్యార్థి, కుల సంఘాలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వా మ్య పాలనలో ప్రతిఒక్కరికీ విమర్శించే హక్కు ఉందని, దాన్ని ప్రభుత్వం స్వీకరించాలే తప్ప.. దాడులకు పాల్పడడం సరికాదని చెప్పారు. చట్టసభల్లో ప్రజాసమస్యల్ని ఎత్తిచూపేందుకు ప్రతిపక్షాలకు అంబేద్కర్ అవకాశం కల్పించారని, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరుగున పడేస్తుందన్నారు. శాసనసభ సభ్యుల సస్పెన్షన్‌పై మిగతా సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని తెలిపారు. రైతులకు బేడీలు, ధర్నా చౌక్ ఎత్తేయడం, ఎవరైనా శాసనసభ్యుడు మాట్లాడితే.. వచ్చేసారి ఏలా గెలుస్తావో.. చూస్తానని బెదిరించడం ఏంటని ప్రశ్నించారు. రైతు సమితులను టీఆర్‌ఎస్ కార్యకర్తలతో నింపారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నాటికి రూ.12 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే.. ప్రస్తుతం అది రూ.2 లక్షల కోట్లకు చేరిందని అన్నారు. గవర్నర్ ప్రసంగంలో ప్రజాసమస్యల ప్రస్తావన లేకపోవడం బాధకరమని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులకు రీడిజైనింగ్ పేరుతో అంచనా వ్యయాన్ని ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించారు.

English Title
Emergency conditions in the state
Related News