మార్కెట్లో ఉత్సాహం

Updated By ManamFri, 09/07/2018 - 22:15
bse

bseముంబై: ఈక్విటీ గీటురాళ్ళు వరుసగా రెండో సెషన్‌లో శుక్రవారం తమ స్థితిని చక్కదిద్దుకున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఓ మోస్తరు కోలుకోగా, మోటారు వాహనాల కంపెనీల షేర్లలో ర్యాలీ సూచీలను ఆరోహణ క్రమంలో నడిపించింది. బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల ‘సెన్సెక్స్’ 147.01 పాయింట్లు పెరిగి 38,389.82 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ 52.20 పాయింట్లు లాభపడి 11,589.10కి చేరింది. వారం ప్రాతిపదికన చూస్తే, సెన్సెక్స్, నిఫ్టీల రెండింటి ఆరు వారాల విజయ పరంపరకు బ్రేక్ పడింది. వారం మొత్తంమీద చూస్తే సెన్సెక్స్ 255.25 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 91.40 పాయింట్లు కోల్పోయింది. 

ప్రభుత్వ నిర్ణయంతో ఆనందం
ప్రత్యామ్నాయ ఇంధనాలపై నడిచే ఎలక్ట్రిక్  వాహనాలు, ఆటోమొబైల్స్‌ను పర్మిట్ అవసరాల నుంచి మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన వెంటనే ఆటోమొబైల్స్ షేర్లు బాగా పెరిగాయి. సెన్సెక్స్ ప్యాక్‌లో  హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటోలు టాప్ గైనర్లుగా నిలిచాయి. 

కాస్త కోలుకున్న రూపాయి
డాలర్‌తో రూపాయి మారకం విలువ 29 పైసలు బలపడి ఇంట్రా-డేలో రూ. 71.70గా ఉంది. రూపాయి మారకం విలువ గురువారంనాడు రూ. 71.99 వద్ద కుదుటపడడానికి ముందు జీవిత కాల కనిష్ఠ స్థాయి రూ. 72.11కు పడిపోయింది. రూపాయి విలువ క్షీణించడం, ముడి చమురు ధరలు పెరగడంతో గత కొద్ది సెషన్లలో దాదాపు 880 పాయింట్లు పతనమైన తర్వాత, సెన్సెక్స్ గత రెండు రోజుల్లో తిరిగి లాభపడడం ప్రారంభించింది. సరసమైన ధరలకు లభిస్తున్న విలువైన షేర్లు కొనుగోలుకు నోచుకోవడం మార్కెట్ల పెరుగుదలకు కారణమైంది. హెచ్చు స్థాయిలో ప్రారంభమైన బి.ఎస్.ఇ సెన్సెక్స్ చివరలో ముమ్మరంగా సాగిన కొనుగోళ్ళతో 38,421.56 గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 147.01 పాయింట్ల లాభంతో 38,389.82 వద్ద ముగిసింది. ఇంట్రా-డేలో అది 38,067.22 కనిష్ఠ స్థితిని కూడా చూసింది. నిఫ్టీ ఇంట్రా-డేలో 11,603 గరిష్ఠ స్థాయిని తాకింది. దేశీయ మదుపు సంస్థలు గురువారం రూ. 611.98 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ. 455 కోట్ల విలువ చేసే ఈక్విటీలను విక్రయించారని తాత్కాలిక డాటా సూచించింది.

English Title
Enthusiasm in the market
Related News