పర్యావరణ పరిరక్షణకూ మాతృభాషలే మార్గం

Updated By ManamMon, 02/19/2018 - 03:36
mahi-main

mahi-mainభాష, పర్యావరణం అనేవి రెండు విభిన్న అంశాలుగా పైకి కనిపించినప్ప టికీ, వాస్తవంలో అవి రెండు పరస్పర ఆధారితాలుగా ఉం టాయి. సంప్రదాయక జనావాసాల సాంస్కృతిక, భాషా వైవిధ్యం అంతరిస్తే పరిసరాల సహజ వాతావరణం క్షీణిస్తుందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. భాష అంతరిస్తే జీవవైవిధ్య పరిరక్షణ ప్రమాదంలో పడుతుందని ఐక్యరాజ్య సమితి ‘విద్య వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ’ (యునిసెఫ్) అధ్యయనం స్పష్టంచేసింది. పర్యావరణంతో ముడి పడి భాషకు సంప్రదాయక విజ్ఞానానికి (టీకే) మధ్య ఒక ప్రాథమిక లింకు ఉంటుంది. ప్రాకృతిక ప్రపంచంతో స్థానిక, ప్రాంతీయ మానవ సమూహాలకు తమ చుట్టూ ఆవరించిన స్థానిక వాతావరణాన్ని ప్రతిఫలించే క్రమంలో విస్తృత మైన వర్గీకరణతో కూడిన అవగాహన ఉంటుంది. స్థానిక ప్రాకృతిక విజ్ఞానం స్థానిక పేర్లలోను, మౌఖికంగాను, ప్రత్యేకమైన వర్గీకరణల్లోనూ నిక్షిప్తమై ఉంటుం ది. ఒకానొక ప్రాంతంలోని మానవ సమూహం తమ మాతృ భాషను వదిలి, వేరొ క భాషను చేపట్టినట్లయితే, శతాబ్దాల తరబడి, తరాల తరబడి సాధించిన స్థానిక విజ్ఞానమంతా ఆ భాషతో పాటు అంతరించిపోతుంది. స్థానిక విజ్ఞాన భాండాగా రంగా మాతృభాషలు పనిచేస్తాయన్న సత్యాన్ని గ్రహించకపోతే మానవజాతి విశ్వ విజ్ఞాన సంచయనానికి గండి పడి నట్లవుతుంది. 

పెరూలోని ఎగువ అమెజాన్ ప్రాంతంలో నివసిస్తున్న అమ్యూషా తెగ మా ట్లాడే భాష అంతరించిపోగానే బహుళ పంటలు ఏకకాలంలో పండిస్తున్న వారి స్థానిక విజ్ఞానమంతా అంతరించిపోయి, దేశవాళి వ్యవసాయం పూర్తిగా దెబ్బతిన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మొక్కల పెరుగుదల, వివిధ రకాల నేలలు, భూసార పోషకాలు, విభిన్న పర్యావరణ అంతరాలు, పర్యావరణ సమూహాలు, ప్రకృతి దృశ్యాలు వగైరాల గురించి మవోరి తెగ పెద్దల మౌఖిక సంప్రదాయాల్లో నిక్షిప్తమైన విజ్ఞానశాస్త్రానికి తెలి యని కొత్త సమాచారాన్ని కొందరు శాస్త్రవేత్తలు సేకరించి ప్రపం చాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. జీవవైవిధ్యాన్ని, పర్యావరణ పరిరక్షణకు స్థానిక/ప్రాంతీయ భాషలు (మాతృభాషలు) అద్భు తమైన సాధనాలుగా ఉపకరిస్తాయని యునెస్కో కార్యచ రణ పత్రం వివరణాత్మంగా చెప్పింది. ఇండో పసిఫిక్ ఉష్ణమం డల సముద్రాల్లో జీవించే ‘దుగాంగ్’ (సముద్రపు చిన్నది) ఒక అంతరిస్తున్న భారీ శాకాహార సముద్ర క్షీరదం. దుగాంగ్ మాంసం, నూనెల్లో కీళ్ళవాతం, నడుంనొప్పి తదితర దేహబాధల నివారణ, కామోద్దీపన కలిగించే ఔషధ లక్షణాలున్నట్లు స్థానిక వైద్య విధానాలు పరిగణి స్తున్నందున దుగాంగ్‌ల వేట శతాబ్దాలుగా కొనసాగిం ది. దాంతో ప్రకృతి పరిరక్షణ అంతర్జాతీయ సమితి (ఐయూసీఎన్) రూపొందించిన ‘రెడ్‌లిస్ట్’లో అంటే అంతరించిపోతున్న ప్రాణుల జాబితాలో దుగాం గ్‌లు కూడా చేరాయి. మనదేశంలో గుజరాత్, తమిళనాడుకు చెందిన మన్నార్ గల్ఫ్, అండ మాన్ నికోబార్ ద్వీపాల సమీపంలోని సము ద్రగర్భంలో దుగాంగ్‌ల పరిరక్షణ కోసం స్థా నికులను చైతన్యపరచే కార్యక్రమాలు ప్రభు త్వం చేపట్టింది. దుగాంగ్ అనడానికి బదు లుగా వాటిని ఇంగ్లీష్ భాషలో పిలిచే ‘సీకౌ’ అన్న పదానికి తమిళంలో ‘కడల్ పశు’ అని అనువదించి ప్రజల్లో ప్ర చారం చేశారు. అయితే ఆ ప్రచారాన్ని ‘పశువులు సముద్రంలోకి వెళ్ళి చనిపోవ డం’ అని స్థానికులు అర్థం చేసుకోవడంతో దుగాంగ్‌ల పరిరక్షణ కార్యక్రమం కుం టుపడింది. ప్రజలకు అర్థంకాని స్థానికేతర పదాలను వినియోగించడం వల్ల ప్రజ లు దుగాంగ్‌లను యథేచ్ఛగా చంపివేశారు. స్థానిక భాషను నిర్లక్ష్యం చేయడంతో ఒక అరుదైన జలచరం అంతరించడాన్ని నిరోధించలేకపోవడం విచారకరం. జీవ వైవిధ్య పరిరక్షణకు స్థానిక ప్రజల సహకారం ప్రాథమిక షరతుగా గుర్తించాలి. స్థానిక భాషావ్యవహర్తలు, పరిణామ శాస్త్రవేత్తలు, భాషావేత్తలు పరస్పర సహకా రంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని యునెస్కో పత్రం తేల్చిచెప్పింది. స్థానిక ప్రజలు తమ మాతృభాషలో నిక్షిప్తమై ఉన్న విశిష్ట సంప్రదాయ జ్ఞానాన్ని అందిస్తే, శాస్త్రవేత్తలు ఆధునిక పర్యావరణ విజ్ఞానాన్ని సంప్రదాయక విజ్ఞానంతో సంశ్లేషిస్తా రు. తరతరాలుగా మానవ కార్యకలాపంలో నుంచి ఉద్భవించిన సంప్రదాయ వి జ్ఞానాన్ని (టీకే), దాన్ని నిక్షిప్తం చేసిన స్థానిక (మాతృ) భాషలను సంరక్షించుకొని విశ్వ విజ్ఞానాన్ని మరింత పరిపుష్టం చేయడమే కాదు పర్యావరణ పరిరక్షణకు దోహదపడడం ద్వారా మానవడ మనుగడ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కీలక సాధనంగా ఉపకరిస్తుంది. సంప్రదాయక విజ్ఞానం, దాన్ని నిక్షిప్తం చేసుకున్న స్థాని క (మాతృ) భాషలు జీవైవె విధ్య పరిరక్షణకు, సుస్థిర నిర్వహణకు నమ్మదగిన సాధ నంగా నిలుస్తుందని యునెస్కో పత్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భాష అనే ది కేవలం పదజాలం కాదు. భాష అనేది వైవిధ్యభరిత మానవ అనుభూతి, ఆచర ణాత్మక జ్ఞాన సంచయన భాండాగారం. అది స్థానిక విజ్ఞానం, పర్యావరణంతో మమేమకమైన నాగరికతా సంపద.
 
పర్యావరణం, సామాజిక శ్రమల ప్రేరణతోనే భాష, చైతన్యాలు అభివృద్ధి చెందాయి. భిన్నప్రాంతాల పర్యావరణాల వైవిధ్యతలను బట్టి భిన్నభాషలు అవత రించాయి. ప్రపంచంలోని 6,900 భాషల్లో ఎక్కడైతే జీవ వైవిధ్యం ఎక్కువగా ఉం టుందో, మహా జీవవైవిధ్య ప్రాంతాల్లోనే ఎక్కువ జీవజాతులు, ఎక్కువ భాషలు ఉనికిలో ఉన్నాయి. ప్రపంచభాషల్లో 60 శాతం జీవవైవిధ్యం మెండుగా ఉన్న దక్షి ణార్థ గోళ ఉష్ణమండల ప్రాంతాలలోనే ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచభాషల్లో 25 శాతం  పపువాన్యూగినియా, ఇండోనేషియా దేశాల్లోనే ఉన్నాయి. అతి చిన్నమహా జీవ వైవిధ్య నిలయమైన న్యూగినియాలో 976 భాషలున్నాయంటే ఆశ్చర్యమే. ఇంతవరకు నమోదైన చర్రితలో మునుపెన్నడూ లేనివిధంగా భూగోళంపై జీవజా లం వెయ్యిరెట్లు అధికంగా అంతరించిపోతుంటే, అదే సమయంలో 1970ల మధ్య నుంచి 60 శాతం ప్రపంచ భాషలు అంతర్ధానమయ్యాయంటే ఆశ్చర్యమే. 2099 లో 90 శాతం భాషలు అంతరించిపోగలవని అధ్యయనాలు చెబుతున్నాయి. ఐక్య రాజ్య సమితి రూపొందించిన అంతరించిపోతున్న భాషల జాబితాలో తెలుగు కూ డా ఉందని ప్రకటించి చాలారోజులైనా, మన తెలుగు సోదరులకు చీమకుట్టినట్లై నా ఉండక పోవడం సిగ్గుచేటు. అదేవిధంగా మహా జీవ వైవిధ్య ప్రాంతాలున్న భారతదేశంలోనూ 380 భాషలు వాడుకలోకి వచ్చాయి. 

చరిత్రలో వివిధ సామాజిక వ్యవస్థల అభివృద్ధి స్థాయిని బట్టి, ఆయా సమాజాల భాషా సంపద అభివృద్ధి చెందుతుంది. భాషల మధ్య గొప్పదనాలలో తేడా ల్లేవు. ప్రతి భాషదాన్ని మాట్లాడే జాతికి అంతరాత్మ అవుతుంది. ప్రతిభాష తాను పరిస్థితుల రీత్యా ప్రామాణికమైనదిగాను, ప్రపంచభాషా సంపదలో తనదైన ము ద్రతోను ఉంటుంది. సమాజ భౌతిక జీవితానికి అనుమేయంగా భాషా సంపద అభివృద్ధి చెందుతుంది. ప్రపంచీకరణ కైపులో, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకు పరిమితమైన అభివృద్ధి వ్యూహంతో సాగే దక్షిణార్థగోళ వ్యవసాయ దేశాల ప్రభు త్వాలు, పాలకవర్గాలు పర్యావరణాన్ని ధ్వంసం చేయడమే కాకుండా మాతృ భాషల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నాయి. దాంతో విశ్వమానవ జ్ఞానభాండాగారం లో స్థానిక విజ్ఞానం అంతర్భాగమయ్యే పరిస్థితికి గండి పడుతోంది. జ్ఞానం ఎప్పు డూ స్థానికం నుంచి ప్రారంభమై విశ్వజనీనమైతుంది. ప్రపంచ పెట్టుబడి దారీ విధానం అడుగుపెట్టిన చోటల్లా స్థానిక జీవ వైవిధ్యం, స్థానిక సాంస్కృతిక వార సత్వం, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను ధ్వంసం చేసింది. మితిమీరిన పారి శ్రామికీకరణ, మితిమీరిన సంపద కేంద్రీకరణ, మితిమీరిన జనాభా కేంద్రీ కరణ మితిమీరిన పర్యావరణ విధ్వంసానికి దారితీస్తాయి. దాంతో స్థానిక జీవ వైవిధ్యపు జ్ఞానాన్ని తవ్వితీస్తున్న, నిక్షిప్తం చేస్తున్న స్థానిక/మాతృభాషలు అంతరించిపోతు న్నాయి. ప్రపంచ మార్కెట్ అవసరాల నేపథ్యంలో స్థానిక పర్యావరణ విధ్వంసం తో స్థానిక/మాతృభాషలు అంతరించిపోవడానికి, భాషలు అంతరించిపోవడం తిరిగి పర్యావరణ పరిరక్షణ కొనసాగకపోవడానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో మాతృభాషా పరిరక్షణ ఉద్యమం, పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు రెండూ పరస్పర పూరకాలుగా సాగాలి.

మితిమీరిన సంపద కేంద్రీకరణ, మితిమీరిన జనాభా కేంద్రీకరణ మితి మీరిన పర్యావరణ విధ్వంసానికి దారితీస్తాయి. దాంతో స్థానిక జీవ వైవిధ్యపు జ్ఞానాన్ని తవ్వితీస్తున్న, నిక్షిప్తం చేస్తున్న స్థానిక/మాతృభాషలు అంతరించిపోతున్నాయి. ప్రపంచ మార్కెట్ అవసరాల నేపథ్యంలో స్థానిక పర్యావరణ విధ్వంసంతో స్థానిక/మాతృభాషలు అంతరించిపోవడానికి, భాషలు అంతరించిపోవడం తిరిగి పర్యావరణ పరిరక్షణ కొనసాగకపోవడానికి దారితీస్తోంది.
వెన్నెలకంటి రామారావు
(ఫిబ్రవరి 21 మాతృభాష దినోత్సవం సందర్భంగా)

Tags
English Title
Environmental protection is the way of mother tongue
Related News