అత్యంత విషమంగా మాధవి పరిస్థితి

Updated By ManamWed, 09/19/2018 - 20:14
erragadda murder attempt case
erragadda murder attempt case

హైదరాబాద్ : కన్నతండ్రి చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ మాధవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మాధవి ఆరోగ్యంపై వైద్యులు మాట్లాడుతూ.. రెండు మూడు రోజులు అయితే కానీ ఏ విషయం చెప్పలేం. రక్తస్రావం చాలా ఎక్కువగా జరిగింది. మాధవి మెడ నరాలు చాలావరకూ దెబ్బతిన్నాయి. సంఘటన రోడ్డు మీద జరగటంతో ఇన్‌ఫెక్షన్ కూడా ఉంది.  ఆమెకు న్యూరో, కాస్మొటిక్, వాస్కులర్ సర్జర్ల ద్వారా చికిత్స జరుగుతోంది.

మనోహరాచారి అరెస్ట్..

honor killing

కాగా వారం క్రితం ప్రేమ వివాహం చేసుకున్న మాధవి-సందీప్‌‌పై మాధవి తండ్రి మనోహరాచారి కత్తితో దాడి చేసినట్లు ఎస్సార్ నగర్ ఏసీపీ తెలిపారు. ఈ దాడి జరిగిన సమయంలో మనోహరాచారి మద్యం మత్తులో ఉన్నట్లు చెప్పారు. మనోహరాచారిని అరెస్ట్ చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ వెల్లడించారు.  అయితే సందీప్ తో పాటు తన కుమార్తెను చంపే ఉద్దేశం లేదని, అయితే మద్యం మత్తులో అలా జరిగిందని నిందితుడు వెల్లడించానట్టు తెలిపారు.

మనోహరాచారి దాడి చేసిన దృశ్యం ...

honor killing

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

English Title
Erragadda murder attempt case: Madhavi Health Condition is Critical
Related News