ప్రతి చర్యలతో వృద్ధికి విఘాతమే

Updated By ManamTue, 03/13/2018 - 01:29
Standard-And-Poor

Standard-And-Poorన్యూఢిల్లీ: ఉక్కు, అల్యూమినియంపై సుంకాలు పెంచుతూ అవెురికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం, యూరోపియన్ యూనియన్ (ఇ.యు), చైనాల నుంచి ప్రతి చర్యలకు దారితీసి, వాణిజ్య యుద్ధాన్ని రేకెత్తించి, ప్రపంచ ఆర్థిక వృద్ధిని దెబ్బతీసే అవకాశం ఉందని ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ సోమవారం పేర్కొంది. మొత్తంమీద, అవెురికా విధించిన సుంకాల ఆర్థిక ప్రభావం సమీప కాలంలో పరిమితంగా ఉండవచ్చని, కార్పొరేట్ రంగాలపై మిశ్రమ ప్రభావం పడవచ్చని వెల్లడించింది.  ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను వరుసగా 25 శాతం, 10 శాతం పెంచుతూ  అవెురికా గత వారం నిర్ణయం తీసుకుంది. వర్తక నిపుణుల ప్రకారం, అవెురికాకు ఈ వస్తువుల ఎగుమతులపై ఆ నిర్ణయం ప్రభావం చూపకపోవచ్చు. అయితే, అటువంటి సంరక్షణవాద చర్యలు ప్రపంచ వర్తకంపై ప్రభావం చూపవచ్చని వారు భయాలు వ్యక్తం చేశారు. ‘నాలుగు రోడ్ల కూడలిలో అంతర్జాతీయ వర్తకం: పెరిగిన ప్రతీకార చర్యల రిస్కు’ పేరుతో ఆ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఈ సుంకాల ప్రత్యక్ష లేదా మొదటి విడత స్థూల ఆర్థిక ప్రభావం ఉపేక్షించ దగినదిగానే ఉండవచ్చని, మొత్తంమీద ప్రభావం అంత కచ్చితంగా ఉంటుందని చెప్పలేమని ఆ నివేదిక పేర్కొంది. అయితే, ఇ.యు, చైనా, దక్షిణ కొరియా లాంటి అవెురికాకు చెందిన ఇతర ప్రధాన వాణిజ్య భాగస్వాములు ఎలా స్పందిస్తాయనే దానిపైనె అదంతా ఆధారపడి ఉంటుందని నివేదిక తెలిపింది. అనేక అవెురికా వాణిజ్య భాగస్వామ్య దేశాలు ట్రంప్ ప్రకటన పట్ల తమ ఆందోళనపై ఇప్పటికే సంకేతాలిచ్చాయి. అవెురికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై స్వీయ టారిఫ్‌లు విధించడం ద్వారా ఎదురు దాడికి సిద్ధంగా ఉన్నామని కూడా అవి ప్రకటించాయని రేటింగ్ ఏజన్సీ గుర్తు చేసింది. ‘‘వినియోగదార్లు, వ్యాపార సంస్థల విశ్వాసంపై పడడానికి అవకాశం ఉన్న రెండవ విడత ప్రభావాల సామర్థ్యం ఎక్కువ ముఖ్యమైంది. అంతిమంగా అది జి.డి.పిని వెనక్కి లాగవచ్చు’’ అని ఎస్ అండ్ పి పేర్కొంది. ‘‘పూర్తి స్థాయి వాణిజ్య యుద్ధం సంభవిస్తుందని మేమూ అనుకోవడం లేదు. కానీ, అటువంటి అవకాశాన్ని తోసిపుచ్చలేం కూడా. అవెురికా సుంకాలు, దాని వాణిజ్య భాగస్వాములు దండన, ప్రతీకారేచ్ఛతో విధించే ప్రతి సుంకాలకు దారి తీయవచ్చు. దానివల్ల సంక్షేమం దెబ్బతింటుందని తెలిసినా, అవి ప్రతి చర్యలకు ఉపక్రమించవచ్చు’’ అని  ఎస్ అండ్ పి రేటింగ్స్ ఆర్థికవేత్త పాల్ గ్రూయెున్‌వాల్ చెప్పారు. ఈ సుంకా హెచ్చింపు అవెురికాలో ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తిని, వినియోగ స్థాయిలను పెంచవచ్చు. దేశీయంగా ధరలు వచ్చే 2-3 ఏళ్ళలో హెచ్చు స్థాయిల్లో ఉండేట్లు చేయువచ్చు.  

English Title
Every action is disrupting growth
Related News