పెట్టుబడి పెంచుకున్న ఎవైల్ ఫైనాన్స్

Updated By ManamWed, 03/14/2018 - 22:39
avail-cofounders-by_sumit

avail-cofounders-by_sumitన్యూఢిల్లీ: బెంగళూరు కేంద్రంగా ఉన్న ఆన్‌లైన్ రుణ ప్లాట్‌ఫాం ఎవైల్ ఫైనాన్స్ ఈక్విటీ, రుణం, క్రెడిట్ లైన్ల ద్వారా 17.2 మిలియన్ అవెురికన్ డాలర్లను సేకరించినట్లు బుధవారంనాడు వెల్లడించింది. మ్యాట్రిక్స్ పార్ట్నర్స్ సంస్థ నుంచి, ఇన్వెస్టర్లు భవీశ్ అగర్వాల్, అంకిత్ భాటీ (ఓలా స్థాపకులు), బిన్నీ బన్సల్ (ఫ్లిప్‌కార్ట్ సహ స్థాపకుడు, గ్రూప్ సి.ఇ.ఓ), కుణాల్ షా (ఫ్రీచార్జ్ స్థాపకుడు), మనీశ్ పటేల్  (ఎంస్వైప్ స్థాపకుడు, సి.ఇ.ఓ)ల నుంచి ఆ మొత్తాన్ని సేకరించినట్లు సంస్థ తెలిపింది. వ్యాపారాన్ని విస్తరణకు, రుణ ప్రదాన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఈ నిధులు వినియోగించుకోనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంకుశ్ అగర్వాల్, తుషార్ మెహీంద్రత్తాలు గత ఏడాది ఫిబ్రవరిలో స్థాపించిన ఈ సంస్థ దేశంలోని కార్మికులకు రుణాలు ఇవ్వడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. వ్యవస్థీకృత రుణ ప్రదాన సంస్థలు ఈ విభాగాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. వారికి సులువుగా రుణాలందే అనుభవాన్ని కలిగించాలని మేం కోరుకుంటున్నాం అని అంకుశ్ చెప్పారు. గత ఏడాది కాలంలో, మేం సుమారు రూ. 5 కోట్లు విలువ చేసే రుణాలను 4000 మందికి పంపిణీ చేశాం. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి దీన్ని రూ. 100 కోట్లకు తీసుకెళ్ళాలని మేం కోరుకుంటున్నాం అని ఆయన చెప్పారు. ఈ విభాగానికి తరచు రుణ చరిత్ర ఉండదని ఆయన అన్నారు. తొమ్మిది నెలల కాలానికి రూ. 5000 నుంచి రూ. 60,000 మధ్య రుణాలిచ్చేందు కు కంపెనీ బహుళ డాటా వనరులను ఉపయోగించుకుంటోందని ఆయన చెప్పారు. భవీశ్ అగర్వాల్‌కు చిన్న తమ్ము డైన అంకుశ్ ఎవైల్ కంపెనీ ఇంతకుముందు స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి సుమారు 200,000 అవెురికన్ డాలర్ల పెట్టుబడిని సేకరించినట్లు తెలిపారు.

English Title
Ewai Finance, who raised investments
Related News