బిగ్‌బాస్‌లోకి మాజీ క్రికెటర్..?

Updated By ManamMon, 09/10/2018 - 15:11
Bigg Boss

sreesanthహిందీలో విజయవంతంగా దూసుకుపోతున్న బుల్లితెర షోలలో బిగ్‌బాస్ ఒకటి. ఇప్పటికే 11 సీజన్‌లు పూర్తి అవ్వగా.. ఈ నెల 16 నుంచి 12వ సీజన్ ప్రారంభం కానుంది. కండలవీరుడు సల్మాన్‌ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించబోయే ఈ షోలో ఎవరెవరు పాల్గొనబోతున్నరానే విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. 

ఇందులో భాగంగా ఇప్పటికే దీపికా కకర్, సలీన్ బానోత్, కమెడియన్ భర్తీ సింగ్, ఆమె భర్త హార్ష్ లింబాచియా ఎంపిక ఖరారు కాగా.. తాజాగా బహిష్కృత క్రికెటర్ శ్రీశాంత్‌ కూడా ఇందులో పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా టీమిండియాలో ఓ వెలుగు వెలిగిన శ్రీశాంత్.. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఇండియన్ క్రికెట్ టీం నుంచి బహిష్కరించబడ్డాడు. ఆ తరువాత నిర్దోషిగా తేలాడు. అయినా అతడిని టీంలోకి తీసుకునేందుకు బీసీసీఐ ఒప్పుకోలేదు. ఇక క్రికెట్ నుంచి బయటకొచ్చిన శ్రీశాంత్ ఆ తరువాత కొన్ని సినిమాలలో నటించాడు. అలాగే కేరళ ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలో నిలబడి ఓడిపోయిన విషయం తెలిసిందే.

English Title
Ex crickter in Bigg Boss 12..?
Related News