వైఎస్సాఆర్ సీపీలోకి మాజీ డీజీపీ సాంబశివరావు

Updated By ManamSat, 08/25/2018 - 18:10
EX DGP sambasiva rao to join YSRCP
AP EX DGP Sambasivarao-Ys jagan

విశాఖ : ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ సాంబశివరావు త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం విశాఖ జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. రాంబిల్లి మండలం హరిపురంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను శనివారం సాంబశివరావు కలిశారు. పార్టీలో చేరిక విషయాన్ని ప్రస్తావించారు.  

కాగా సాంబశివరావు స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు. గత ఏడాదే ఆయన ఏపీ డీజీపీగా పదవీ విరమణ చేశారు. మరోవైపు సాంబశివరావు చేరికను ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ధ్రువీకరించారు.

English Title
Ex DGP Sambasiva Rao to join YSRCP soon, meets Jagan in prajasankalpa yatra




Related News