రోజూ గ్లాసు మద్యం పుచ్చుకుంటే.. మటాష్..!

Updated By ManamMon, 04/16/2018 - 11:58
Alcohol consumption, shortens lifespan, study says, alcoholic drink every day, researchers at the University of Cambridge

Alcohol consumption, shortens lifespan, study says, alcoholic drink every day, researchers at the University of Cambridgeవెబ్ ప్రత్యేకం:మందుబాబులూ జర భద్రం.. ప్రతిరోజూ ఒక గ్లాసు చొప్పున మద్యం పుచ్చుకుంటున్నారా? అయితే మీ ఆయుష్షు 30 నిమిషాల వరకు తగ్గిపోతుదంట. గ్లాసుకు మించి బీర్, వైన్ ప్రతిరోజు సేవిస్తే.. 40ఏళ్లలో వారి జీవితకాలం అరగంట తగ్గిపోతుందని ఓ తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. వారానికి 10 గ్లాసులకు పైగా మద్యం తాగినవారిలో ఒకటి నుంచి రెండేళ్ల ఆయుష్షు తగ్గిపోతుంది. ప్రతివారం 18 గ్లాసులకు పైగా మద్యం పుచ్చుకుంటూపోతే మాత్రం వారిలో జీవితకాలం 4 నుంచి 5 ఏళ్ల ఆయుష్షు తగ్గిపోతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. యుకే పరిశోధకులు కనుగొన్న అధ్యయనానికి సంబంధించి ఆర్టికల్‌ను శుక్రవారం ది లాన్సెట్‌లో ప్రచురించారు. ప్రస్తుత యూకే మార్గదర్శకాల ప్రకారం.. వారానికి 14 యూనిట్లకు పైగా మద్యం సేవిస్తే.. అది ఏడు గ్లాసుల వైన్ లేదా ఆరు పింటుల బీరుకు సమానమని తేల్చారు. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌ వర్సిటీ పరిశోధకుల నేతృత్వంలోని బృందం 19 దేశాలకు చెందిన దాదాపు ఆరు లక్షల మంది ఆల్కహాల్ సేవించేవారి నుంచి సమాచారాన్ని విశ్లేషించారు.

ఇందులో మద్యం సేవించేవారి వయస్సు, డయాబెటిస్ ప్రభావం, పొగత్రాగడం, విద్యాస్థాయి, వృత్తులకు సంబంధించి సమాచారాన్ని కూడా విశ్లేషించారు. అధ్యయనం ప్రకారం.. వారానికి ఐదు గ్లాసుల కంటే 100 మిల్లీలీటర్ల మద్యాన్ని సేవించేవారిలో హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్, రక్తనాళం ఉబ్బిపోవడం వంటి పలు సమస్యలతో మరణానికి దారితీసే అవకాశాలు ఉన్నాయని గుర్తించారు. ఈ సమాచారాన్ని వారానికి 100 మిల్లీలీటర్ల కంటే తక్కువగా తాగేవారితో సరిపోల్చారు. దీంతో 100 నుంచి 200 మిల్లీలీటర్ల మధ్య తాగేవారికి 40 ఏళ్లలో ఆరు నెలల వరకూ ఆయుష్షు తగ్గుతున్నట్లు తేలింది.

English Title
Excessive alcohol consumption shortens lifespan, University of Cambridge study says
Related News