బ్లూ డార్ట్ సర్వీసుల విస్తరణ

Updated By ManamFri, 09/21/2018 - 22:12
Blue-Dart

Blue-Dartహైదరాబాద్: తెలంగాణలో అన్ని మారుమూల గ్రామాలకు బ్లూ డార్ట్ డెలి వరీ సర్వీసును అందుబాటు లోకి తీసుకువచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో అన్ని మారుమూల గ్రామాలకు కూడా తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకునే దిశగా సాగుతున్నట్లు బ్లూ డార్ట్ వెల్లడించింది. కాగ ఈ ఏడాది ప్రారంభంలో 6,164 పిన్‌కోడ్ ప్రాంతాల ఉన్న తమ సర్వీసులను 17,677కు పై చిలుకు పిన్‌కోడ్ ప్రాంతాలకు తమ సర్వీసులను విస్తరించినట్లు బ్లూ డార్ట్ పేర్కొంది. అయితే ఇందులో మొత్తం 16 రాష్ట్రల్లో 100 శాతం ప్రాంతాలకు తమ డెలివరీ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కంపెనీ పేర్కొంది. అదే విధంగా 2018 డిసెంబర్ నాటికి మిగితా రాష్ట్రాల్లో పూర్తి ప్రాంతానికి తమ సర్వీసులను విస్తరించన్నుట్లు  సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ ఖన్న పేర్కొన్నారు. టైర్ 2,3,4 పట్టణాల్లో పెరుగుతున్న డిమాండును అందిపుచ్చుకునే దిశగా ఈ విస్తరణను చేపట్టినట్లు ఆయన తెలిపారు.  

Tags
English Title
Expanding Blue Dart Services
Related News