ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూపులు

Updated By ManamSat, 04/14/2018 - 01:30
IMAGE

imageబీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌కు ఇప్పటికీ అవకాశం ఉంది. మోదీ పాలనపై వస్తున్న వ్యతిరేకతను అస్త్రంగా చేసుకోవడానికి, ప్రజల హృదయాలను చూరగొనడానికి ఆ పార్టీకి ఇప్పటికీ దారి ఏర్పడి ఉంది. అయితే ఆ పార్టీ తన పూర్వ తప్పిదాలను అర్థం చేసుకుని అవి పునరావృతం కావనే అభిప్రాయం కలిగించాలి.

దేశ ప్రజలిప్పుడు కనీవినీ ఎరుగని అయోమయ స్థితిలో ఉన్నారు. ఎటూ తేల్చుకోలే ని స్థితిలో ఉన్నారు. ఎన్నో ఆశలతో బీజేపీకి అధికారమిచ్చిన దేశ ప్రజలకు ఆ పార్టీ మీద క్రమంగా ఆశలు ఆవిరవుతున్నాయి. ప్రత్యామ్నాయం కోసం ప్రతిపక్షాల వైపు చూస్తున్న ప్రజలకు ప్రతిపక్షాలు కూడా బీజేపీ కంటే అధ్వానంగా ఉన్నట్టు అనిపిస్తోంది. ప్రజలు భగ్నహృదయం పరి స్థితిని అనుభవిస్తున్నారు. అధికార పక్షం ఏ స్థాయిలో ఉందో ప్రతిపక్షాలు కూడా అదే స్థితిలో ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశ ప్రజలకు ఈ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోంది. ఎవరికి ఓటెయ్యాలి అనేది అత్యధిక సంఖ్యాక ప్రజలకు ఓ పెద్ద ప్రశ్నగా మారిపోతోంది. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ పాత్రను సక్ర మంగా పోషించాలి. ప్రజలకు ప్రత్యామ్నాయం అం దించడానికి గట్టిగా నడుం బిగించాలి. 

ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షా లు కనీసం కొద్దిగానైనా ఆ దిశగా ప్రయత్నాలు చేయ డం మంచిది. పార్లమెంట్‌లో కార్యకలాపాలు స్తంభిం పజేయడం వల్ల ప్రతిపక్షాలు బలం పుంజుకోగల వం టే పొరపాటే. పార్లమెంట్‌లో చర్చ జరగక పోయినా, జరగనివ్వక పోయినా దేశ ప్రజలు మౌనంగా ఉండి పోతారని, వారి దృష్టిలో ప్రతిపక్షాల ఇమేజ్ శిఖరా గ్రానికి వెడుతుందని అనుకోకూడదు. పార్లమెంట్ స్తంభించిపోవడానికి అధికారపక్షం కారణమైనా, ప్రతి పక్షం కారణమైనా అది ప్రజలు జీర్ణించుకోలేని విష యం. ఈ పర్యాయం పార్లమెంట్ సమావేశాలు ఎటువంటి చర్చా లేకుండా, ఎటువంటి కార్యకలా పాలకూ అవకాశం లేకుండా ముగిసిపోవడం ప్రజలకు ఏమాత్రం నచ్చలేదని వారి మనోభిప్రాయాలు తెలు సుకున్నవారెవరికైనా అర్థమవుతుంది. నిజానికి ఇది ప్రతిపక్షాలకు అన్ని విధాలా అను కూలమైన సమయం. ప్రజల్లో తమ ఇమేజ్‌ను పెంచు కోవడానికి అధికార పక్షమే కొండంత అవకాశం ఇస్తోం ది. గత ఎన్నికల ప్రచార సమయంలో పాలక బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించిన వాగ్దానాలు, వరాలు, హామీలలో ఒక్క దానిని కూడా పూర్తిగా నెరవేర్చ లేదు. నెరవేర్చని హామీల సంఖ్యే ఎక్కువ. నరేంద్ర మోదీ ప్రభుత్వ హామీలకు, అమలుకు మధ్య పొంత న కుదరకపోవడమనేది ప్రతిపక్షాలకు సువర్ణావకా శం. అయినా ప్రతిపక్షాలు వాటి గురించి ప్రచారం చే యకుండా పార్లమెంట్‌లో కార్యకలాపాలను స్తంభిం పజేయడంలోనే మునిగిపోయి, ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యతను పూర్తిగా విస్మరించారు. ఇటువంటి ధోరణి ప్రజలను ఏ విధంగా మెప్పిస్తుందో వారే చెప్పాలి. 

అమలు కాని హామీలు   
మోదీ ‘అచ్చేదిన్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. అది ఎప్పటికీ పూర్తి కాని కార్యక్రమం. దాన్ని పూర్తిచేయడానికి తమకు మరికొంత సమయం అవస రమని, అందువల్ల మరోసారి కూడా తమకే అధికార మివ్వాలని మోదీ రానున్న ఎన్నికల్లో కోరే అవకాశం ఉంది. మధ్యతరగతి జీవితాల మాదిరిగానే ఈ కార్య క్రమం కూడా అనేక మలుపులు, ఎత్తు పల్లాలతో ఉండే కార్యక్రమం. మీరెంత కాలం జీవిస్తారన్న దాని పై దీని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అంటే, దీన్ని పూర్తిచేయడానికి ఒక జీవిత కాలం సరిపోదు. ప్రతి పక్షాలు ఈ కార్యక్రమాన్ని ఓ అస్త్రంగా ఉపయో గించుకుంటే కొంత ప్రయోజనం ఉంటుంది. నోట్ల రద్దు కానీ, జీఎస్‌టీ గానీ ఇంతవరకూ పెద్దగా విజయవంతం అయినట్టు కనిపించడం లేదు. పైపెచ్చు అవి ఇప్పటికీ ప్రజల్ని అవస్థల పాలుచేస్తూనే ఉన్నాయనడంలో సందేహం లేదు. వీటివల్ల సామాన్య ప్రజలు నానా కష్టాలూ పడడంతో పాటు, చిన్న వ్యా పారాలు మూతపడిపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూ డా మోదీ పార్టీ అధికారంలోకి వచ్చే పక్షంలో చిన్న వ్యాపారాలకు ఇక గతీ మోక్షంలేదనే అభిప్రాయం సర్వత్రా వ్యాపిస్తోంది. అత్యధిక సంఖ్యాక ప్రజలకు ఈ కార్యక్రమాలు సుతరామూ నచ్చలేదు. ప్రతిపక్షాలు వీటిని మరింతగా ఉపయోగించుకోవడం ఎన్నికల సీజన్‌లో ఉపయోగకరంగా ఉంటుంది. పార్లమెంట్‌లో ఇటువంటి ప్రజాపీడిత అంశాల మీద చర్చ జరుగు తుందని, తాము కష్టాల నుంచి ఒడ్డున పడతామని ఆ శించిన ప్రజలకు ప్రతిపక్షాల ధోరణి తీరని ఆశా భంగం కలిగించింది. 
ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. బీజేపీలో సైతం కొందరు నాయకులు, కార్యకర్తలు త మ పార్టీ పట్ల విసుగెత్తిపోయి ఉన్నారు. మోదీ పెద్ద పె ద్ద మాటలు మాట్లాడడం తప్ప హామీల అమలుకు ప్రయత్నించడం లేదని, హామీల అమలులో ఆయన పూర్తిగా విఫలమయ్యారని ఆయన పార్టీ కార్యకర్తలే నిరాశగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఆయన ప్రభు త్వం పట్ల ఆశలు వదిలేసుకున్న మెజారిటీ ప్రజానీకం ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏమిటని ఎదురు చూస్తు న్నారు. ఇతర సంస్థాగత విషయాలు పక్కనపెట్టి బీజేపీ మార్కెటింగ్ చేసుకోవడంలో దిట్ట. తన వైఫ ల్యాలను సాఫల్యాలుగా చెప్పుకుని ప్రజలను నమ్మిం చగలదు. చేయనివి చేసినట్టుగా చెప్పుకోగలదు. ఆ విధంగానే అది మోదీని ఓ బ్రాండ్‌గా ప్రజల ముం దుంచగలిగింది. ఇప్పుడు ఆ బ్రాండ్‌కు కూడా వెలుగు తగ్గిపోతోంది. అదే మార్కెటింగ్ యంత్రాంగం ప్రతి పక్షాల ఇమేజ్‌ను దిగజార్చింది. 

కాంగ్రెస్‌పై కొండంత ఆశ
కాంగ్రెస్ ఈ బ్రాండ్‌ను, ఈ మార్కెటింగ్ యం త్రాంగాన్ని విమర్శిస్తూ కూర్చుని ఉపయోగం లేదు. 2014 ఎన్నికల ఫలితాలతో నిర్ఘాంత పోయిన కాంగ్రెస్ ఆ తరువాత అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పటికీ అది పునరుజ్జీవనం దిశగా అడుగులు వేయడం లేదు. ఆ పార్టీ కొద్దిగా దూకుడుతనం, చొరవ ప్రదర్శిస్తోంది కానీ, ప్రస్తుత రాజకీయ వాతావరణానికి అది ఏమా త్రం సరిపోదు. కొద్దిగా సోషల్ మీడియా వల్ల, మరి కొద్దిగా గుజరాత్ తదితర ఎన్నికల ఫలితాల వల్ల అది కొద్దిగా కోలుకున్నట్టు కనిపిస్తోంది. రాహుల్ గాంధీ తన ‘పప్పు’ ఇమేజ్ నుంచి బయటికి వచ్చి ఇప్పుడి ప్పుడే నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తున్నారు. బీజేపీ కి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అవడానికి అవకాశం ఉందనే అభిప్రాయం కూడా కలుగుతోంది. విచిత్రమేమిటంటే, కాంగ్రెస్ పట్ల కొద్ది మాత్రం అభిమానం ఉన్న వారికి కూడా యూపీఏ పాలన గుర్తుకు వచ్చి ముందుకు అడుగు పడనివ్వడం లేదు. ఇటువంటి రోజులు పునరావృతం కావాలని ఎవరూ కోరుకోవడం లేదు. అయితే, బీజేపీకి ప్రత్యామ్నా యంగా కాంగ్రెస్‌కు ఇప్పటికీ అవకాశం ఉంది. మోదీ పాలనపై వస్తున్న వ్యతిరేకతను అస్త్రంగా చేసుకోవడా నికి, ప్రజల హృదయాలను చూరగొనడానికి ఆ పార్టీకి ఇప్పటికీ దారి ఏర్పడి ఉంది. అయితే ఆ పార్టీ తన పూర్వ తప్పిదాలను అర్థం చేసుకుని అవి పునరావృ తం కావనే అభిప్రాయం కలిగించాలి. మోదీకే కాక,  తన గతానికి తాను ఓ ప్రత్యామ్నాయంగా కూడా ఎద గాలి. కాంగ్రెస్ నాయకత్వంలో ప్రతిపక్షాలు ఆ ప్రత్యా మ్నాయాన్ని అందించడం అనివార్యం. ప్రతిపక్షాలు ఆ పని విజయవంతంగా చేయగలవా అన్నది చూడాలి. 

image

 

 

 

జి. రాజశుక

English Title
Expectations for the alternative
Related News