ఎగుమతులకు ఊతమిచ్చే ప్రదర్శన

Updated By ManamFri, 02/16/2018 - 01:29
eepc

exhibitionచెన్నై: ఏడవ విడత ఇంటర్నేషనల్ ఇంజనీరింగ్ సోర్సింగ్ షో (ఐ.ఇ.ఎస్.ఎస్) చెన్నైలో 2018 మార్చి8-10 తేదీలలో జరుగనుందని అధికారులు చెప్పారు. ఈ ఏడాది సంచికకు చెక్ రిపబ్లిక్ భాగస్వామ్య దేశంగా ఉండగా, తమిళ నాడు ఆతిథేయ రాష్ట్రంగా ఉందని ఇంజనీరింగ్ ఎగువుతుల ప్రోత్సాహక మండలి (ఇ.ఇ.పి.సి) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భాస్కర్ సర్కార్ ఇక్కడ మీడియా ప్రతినిధులకు చెప్పారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సౌజన్యంతో, ఇ.ఇ.పి.సి ఆధ్వర్యంలో జరిగే 2018 ఐ.ఇ.ఎస్.ఎస్ సుమారు 400 ఎగ్జిబిటర్లను ఆకర్షించగలదని భావిస్తున్నారు. గత ఏడాది ప్రదర్శనను కూడా చెన్నైలోనే నిర్వహించారు. దానిలో సుమారు 300 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. ‘‘ఇది కేవలం ఎగువుతుల ప్రోత్సాహక కార్యక్రమం మాత్రమే కాదు. భారతీయ రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణికి వెసులుబాటు కల్పిస్తున్న ప్రదర్శన’’ అని ఆయన అన్నారు. ఈ షోలో తెలంగాణ, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, హర్యాణా, జార్ఖండ్ రాష్ట్రాలు పాల్గొననున్నట్లు తెలిపారు. స్థానిక వ్యాపార సంస్థలకు, విదేశీ భాగస్వాములతో భాగస్వామ్యాలను పెంపొందించడం ఈ ప్రదర్శన లక్ష్యమని భారతదేశంలో చెక్ రిపబ్లిక్  రాయుబారి మిలన్ హవోర్కా చెప్పారు. ఈ కార్యక్రమంలో చెక్ ప్రతినిధి బృందాలు భాగంగా ఉంటాయి. చెక్ రిపబ్లిక్ ‘‘ఐరోపాలో పెట్టుబడులకు ఉత్తమ గమ్యస్థానాలలో ఒకటి’’ అని హవోర్కా అన్నారు. ఐరోపా ఖండంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో అది ఒకటని తెలిపారు.

మూడు రోజులపాటు సాగే ఈ ప్రదర్శనలో ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధితో సహా వివిధ కేటగిరీల కింద ‘బార్క్’, ఐ.ఐ.టి మద్రాస్, సిమన్స్, కేటర్‌పిల్లర్, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, చెన్నై పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ వంటి దేశ, విదేశీ దిగ్గజాలు పాల్గొననున్నాయి. ‘‘దేశ ఎగువుతులలో ముఖ్యంగా ఇంజనీరింగ్ ఎగువుతులలో గణనీయైమెన వృద్ధి’’ కనబరచిన నేపథ్యంలో ఐ.ఇ.ఎస్.ఎస్ 2018 ప్రదర్శన చోటుచేసుకుంటోందని సర్కార్ చెప్పారు. ‘‘భారతదేశ మొత్తం ఎగువుతుల బాస్కెట్‌లో హెచ్చు ఎంప్లాయ్‌ుమెంట్ ఓరియంటెడ్ ఇంజనీరింగ్ ఎగువుతుల వాటా 26 శాతం పైగా ఉంది’’ అని ఆయన అన్నారు. 
ఈ ప్రదర్శన సుమారు 500 మంది ప్రపంచవ్యాప్త కొనుగోలుదార్లను, 10,000 మంది ట్రేడ్ సందర్శకులను ఆకర్షించగలదని భావిస్తున్నారు. మూడు చెక్ విశ్వవిద్యాలయాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. చెన్నై ట్రేడ్ సెంటర్‌లో ఈ ప్రదర్శనను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు,  చెక్ వర్తక శాఖ మంత్రి తోమస్ హ్యూనర్ ప్రారంభిస్తారు. 

English Title
exports boost exhibition
Related News