విస్తరించిన నష్టాలు

Updated By ManamWed, 09/05/2018 - 22:03
bse

bseముంబై: బలహీనపడిన రూపాయి, ప్రవర్థమాన మార్కెట్ అసెట్ల విస్తృత అమ్మకాలు రిస్క్ తీసుకునే ధోరణిని కట్టడి చేయడంతో ‘సెన్సెక్స్’ బుధవారం వరుసగా ఆరో సెషన్‌లోనూ పతనాన్ని చూసింది. బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల సున్నిత సూచి 139.61 పాయింట్లు క్షీణించి రెండు వారాల కనిష్ఠ స్థాయి 38,018.31 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ 43.35 పాయింట్లు నష్టపోయి 11,476.95 వద్ద ముగిసింది. ‘సెన్సెక్స్’ ఆరు సెషన్లలో 878.32 పాయింట్లు కోల్పోయింది. గత ఆరు నెలల్లో మొదటిసారిగా అది వరుసగా నష్టాలను చవిచూస్తూ వస్తోంది. ‘సెన్సెక్స్’ బుధవారం కొద్ది హెచ్చు స్థితిలోనే ప్రారంభమై ఆరంభ ట్రేడ్‌లో 38,250.61ని తాకింది. కానీ, వెంటనే 38000 స్థాయి దిగువకు పడిపోయింది. అది 38,018.31 వద్ద ముగియడానికి ముందు 37,774.42 కనిష్ఠ స్థితిని చూసింది. ‘నిఫ్టీ’  కూడా 10,400 స్థాయి దిగువకు పడిపోయి 11,393.85 కనిష్ఠ స్థితిని చూసింది. చివరకు నష్టాన్ని 43.35 పాయింట్లకు పరిమి తం చేసుకుని 11,476.95 వద్ద ముగిసింది. దేశీయ మదుపు సంస్థలు మంగళవారం రూ. 21.41 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ. 32.64 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేసినట్లు తాత్కాలిక డాటా సూచించింది. 

కోలుకోని రూపాయి
దేశీయంగా డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇంట్రా-డేలో తాజా రికార్డు కనిష్ఠ స్థాయి రూ. 71.96కు పడిపోయింది. బాండ్ ప్రతిఫలాలు పెరుగుతూండడం డాలర్ బలపడడానికి తోడ్పడింది. 

నిరుత్సాహపరచిన సేవల రంగం 
నూతన వ్యాపార ఆర్డర్లు తరిగిపోవడంతో భారతదేశపు సర్వీసుల రంగ కార్యకలాపాలు జూలైలో ఉన్న 21 నెలల పతాక స్థాయి నుంచి ఆగస్టులో పడిపోయాయని నెలవారీ నివేదిక ఒకటి వెల్లడించడం మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత కుంగదీసింది. నికాయ్ ఇండియా సర్వీసెస్ వ్యాపార కార్యకలాపాల సూచి జూలై నాటి 54.2 నుంచి ఆగస్టులో 51.5కి తగ్గింది. కొత్త పనుల ఆర్డర్లలో వృద్ధి మూడు నెలల కనిష్ఠ స్థాయిలో ఉందని వెల్లడైంది.

English Title
Extended losses
Related News