కన్నడ రీమేక్‌పై కన్ను?

Updated By ManamThu, 03/22/2018 - 02:53
BALAKRISHNA

BALAKRISHNAమాజీ ముఖ్యమంత్రి, కీ॥శే॥ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా త్వరలో తెరకెక్కబోయే ‘యన్.టి.ఆర్’ చిత్రంలో బాలయ్య నటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య నటించబోయే సినిమాపై పలు రకాల వార్తలు వినపడుతున్నాయి. అందులో ఒకటి బాలకృష్ణ కన్నడ సినిమా రీవేుక్‌పై ఆసక్తిగా ఉన్నారని..సాధారణంగా రీమేక్‌లపై పెద్దగా ఆసక్తి చూపని బాలకృష్ణ తాజాగా ఓ కన్నడ మూవీపై కన్నేసినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన ‘మఫ్టీ’ చిత్ర రీమేక్‌లో నటించేందుకు బాలయ్య ఆసక్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది. ‘మఫ్టీ’లో శివ రాజ్‌కుమార్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించగా.. బాక్సాఫీస్ వద్ద ఆ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. త్వరలోనే ఈ విషయమై  క్లారిటీ రానుంది. 

English Title
Eye on Kannada remake?
Related News