రైతు సంక్షేమం సాకారమయ్యేనా!

Updated By ManamTue, 09/04/2018 - 02:14
farmers

భారతదేశం వ్యవసాయమే ప్రధాన వృత్తిగా గల దేశం. వ్యవసాయమే ప్రధాన వృత్తి గల దేశంలో సాధారణంగానే రైతు సంక్షేమం ప్రధాన ప్రాధాన్యం కావాలి, మనదేశంలో వ్యవసాయమే ప్రథమ ప్రాధాన్యం అయినది కాబట్టి మన ప్రభుత్వం ఈ బడ్జెట్లో సంస్కారాలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఆపరేషన్ గ్రీన్స్ వంటి సృజనా త్మక కార్యక్రమాలను రూపొందించింది. ఖరీఫ్ దిగుబడిలో కనీస మద్దతుధర లేని ఉత్ప త్తులకు రైతులకు అయినా ఖర్చుకు ఒకటి న్నర రెట్లుగా ప్రకటించింది. 22 వేల గ్రామీణ వాణిజ్య కూడాలులను, పూర్తిస్థాయి గ్రా మీణ మార్కెట్లుగా విస్తరించే ప్రణాళికను ప్రకటించింది. 

farmer
ప్రస్తుత ఖరీఫ్ పంట కాలంలో సాగు చేసే 14 రకాల పైర్లకు కనీస మద్దతు ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ప్రస్తుతం వ్యవసాయదారులకు మద్ద తుదారులు అందించలేకపోతున్నాయి. ప్రస్తు తం సాధారణ వరి మద్దతు ధరలు క్వింటాకు 1550 రూపాయలు దాన్ని తాజాగా 200కు పెంచారు. ముతక ధాన్యాలు చిరుధాన్యాలు, పత్తికి మాత్రం మద్దతు ధరలు బాగానే ఉన్నట్లు కనిపిస్తుంది. అలాగే రాగి, జొన్న, సజ్జ పంటల మద్దతు ధర వరుసగా 52.5 శాతం 42 శాతం, 37 శాతం చొప్పున పెంచారు. అలాగే క్రమక్రమం గా కందులు, మినుములు మద్దతులో వృద్ధి వరు సగా 225 రూపాయలు, 200 రూపాయలకే పరిమిత మైంది. మరి ముఖ్యంగా టమోటా రైతులు భారీగా నష్టపోతున్నారు కాబట్టి వారిని కూడా దృష్టిలో ఉంచు కొని టమాటా కనీసం మద్దతు ధరను కేంద్ర ప్రభు త్వం, రాష్ర్ట ప్రభుత్వాలు నిర్ణయించాలి. మద్దతు ధరల పెంపుపై ప్రధాని మోదీ ఉత్పత్తి వ్యయం కన్నా ఒకటిన్నర రెట్లు అధికంగా ఉండేలా మద్దతు ఇస్తామంటూ రైతులకు హామీ ఇచ్చి నెరవేర్చినందుకు చాలా సంతోషమని, మద్ద తు ధర పెంపుదల చరిత్రాత్మకంగా రైతులందరికీ అభినం దనలు వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు. మద్దతు ధర పెంపు మాయ అని ఆల్ ఇండి యా కిసాన్ సభ విమర్శించింది. మొత్తం సాగు ఖర్చును పరిగణలోనికి తీసుకోవాలంటూ స్వామినాథన్ ప్రతిపాదించిన సూత్రానికి అనుగుణంగా లేదని పేర్కొంది. ప్రభుత్వం సాగు ఖర్చులు లెక్కించేటప్పుడు భూమిమీద కౌలును పెట్టుబడి మీద వడ్డీ పరిధిలోనికి తీసుకోకపోవడం పెద్దలోటు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుంటే రైతుకు మిగిలేది పెద్దగా ఉండదు. సజ్జలు, రాగులు మాత్రమే మద్దతు ధరను పెంచారు కానీ ఉ ద్యాన పంటలైన టమోటా, ఇతర కూరగాయలకు మద్దతు ధర లేక చాలా రైతులు నష్టపోతున్నారు. 

కేవలం మద్దతు ధర ప్రకటించి ఊరుకుంటే సరిపోదు దాన్ని సక్రమంగా అమలు చేస్తేనే రైతన్నకు లాభం వస్తుంది. అన్ని ప్రాంతాల్లో పండిన పంటలను కొనుగోలు చేయడం లేదు. ప్రభుత్వం సేకరణ కార్యక్రమాలు అన్ని పంటలకు రైతులందరికీ వర్తించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో అరకొరగా నడుస్తున్నాయి. తూతూమంత్రంగా కొనసాగుతున్నాయి ని ర్లక్ష్యం, అలసత్వం పోటీపడుతున్నట్లు రైతులు ఫిర్యాదు చేస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతగా పట్టించుకోవ డం లేదు. ఖరీఫ్ కాలంలో వరి రైతులు పండించిన పం టకు తప్ప మిగతా పంటలను పండించే రైతులు వాటి ని ప్రైవేట్ వ్యాపారులకు అమ్మడం తప్పడం లేదు. అలాంటి రైతులకు మద్దతు ధర రూపంలోనో, మరో రూపంలోనో గిట్టుబాటు ధర లభిస్తుందని ఆశలేదు. ప్రభుత్వం కనీసం మద్దతును ఖరారు చేసిన పని జరగదు ప్రస్తుతం వ్యవ సాయదారులు తానే స్వయంగా పంటలను మార్కెట్లో అమ్మడం కోసం మార్కెటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఈ అం శాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందుకు సంబంధించి వివిధ రాష్ట్ర ప్ర భుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి అనుకూల పరిస్థితు లను రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు వ్యవస్థకు రూప కల్పన చేసే అధికారాన్ని ‘నీతి అయోగ్’ అప్పగించడం జరి గింది. అధిక దిగుబడి సందర్భాల్లో కూడా వ్యవసాయదారులు ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉం ది వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ నుంచి రక్షణ కల్పించాలి.

‘ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన’ అనేది కేంద్ర ప్ర భుత్వానికి సంబంధించిన మరో పథకం ఇది రైతుల సంక్షేమం వారి సుసంపన్నతకు ఉద్దేశించినది. మార్కెటింగ్ పరమైన మద్ద తు ఇవ్వడంతో పాటు ప్రాసెసింగ్, విలువ జోడింపు సదుపా యాలు కల్పించడం ఈ పథక లక్ష్యం. దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా విరివిగా ఉపయోగించే టమాటాలు, ఉల్లి, ఆలుగడ్డ వంటి వాటిని పెద్ద సంఖ్యలో రైతులు తమ జీవనోపాధి కోసం పండిస్తున్నారు. అయితే ఇవి త్వరగా పాడైపోయే గుణం కలిగి ఉండడం వివిధ ప్రాంతాల్లో దిగుబడులు కారణంగా రైతులు వినియోగదారులకు డిమాండ్, సరఫరాకు సంబంధించి ఇబ్బం దులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఫ్లడ్ మాదిరిగా ‘ఆపరేషన్ గ్రీన్స్’ ప్రారంభించింది. 500 కోట్ల రూపాయలు కేటాయించింది. రైతులను సౌకర్యాలు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా రైతులకు వీలు కల్పించే పంటను పండించడానికి ప్రోత్సాహం లభిస్తుంది. రైతులు, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్ర యోజనాలను పరిరక్షించేందుకు ఈ పథకం కింద అగ్రి లాజి స్టిక్స్ ప్రాసెసింగ్ సౌకర్యాలు ఈ పంటను మార్కెట్‌కు ప్రొఫెష నల్ మేనేజ్‌మెంట్ సదుపాయాలను కల్పించడం జరుగుతుంది. దీనికి తోడు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను సరళతరం చేయడం ద్వారా రైతులు ఎగుమతులకు వీలు కల్పించడానికి ప్రోత్సాహం లభిస్తుంది.

అన్నదాతకు ఆర్థిక స్వస్థత కల్పిస్తేనే దేశం కుదుటపడు తుంది. ఈ మౌలిక అంశాన్ని అన్నదాతకు ఆర్థిక స్వస్థత విస్మ రిస్తే ఆ దృష్టాంతాలు అలా అనిపిస్తుంది. అందుకే రైతు జనం తో వ్యవసాయానికి మనుగడ అన్న స్వామినాథన్ వ్యాఖ్యలు అక్షర సత్యం. ప్రస్తుతం మనదేశంలో వ్యవసాయ నిపుణులలో పాలు ఎక్కువగా ఉన్నాయి. వీటివల్ల చిన్న, సన్నకారు రైతుల కు భారీగా నష్టం వస్తుంది. సాగు ఖర్చులు పెరుగుతున్నా కానీ వ్యవసాయ పంటల ధరలు పెరగడం లేదు. 2014-15 నుంచి 2016-17 సంవత్సర కాలంలో వ్యవసాయదారులకు ఆదాయం 16 శాతం పెరిగిన ద్రవ్యోల్బణం వల్ల విలువ తగ్గుతుంది. వ్యవసాయ ధరల ఆదాయం ఏమాత్రం పెరగలేదని నేషనల్ అకౌం ట్స్ స్టాటిస్టిక్స్ సంస్థ తెలిపింది. రాయితీ పథకాల వివరాలు తెలుసుకోవడానికి, దరఖాస్తు చేసుకోవడం, పంటల బీమా, వ్యవసాయ అధికారుల వివరా లను చూసుకోవచ్చు. లక్షల మంది రైతులు సమాచారం, భూముల విస్తీర్ణం, భూసార పరిస్థితి, ఎరువులు, విత్తనాలు, బ్యాంకుల వివరాలు డిజిటలైజేషన్ చేస్తే రైతులకు మేలు కలుగు తుంది. ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తెస్తే రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. గ్రామీణ రైతులకు మేలు చేసేలా సమాచారం డిజిటలీ కరణ చేసి చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, రైతుకు రుణాలు ఇవ్వాలన్న, మార్కెట్ ధరలు నిర్ణయించాలన్న పంటల దిగు బడి మీద ఆధారపడి ఉంటాయని, దాన్ని కాపాడుకుంటూనే రైతుల నేపథ్యంలో సమగ్రంగా డేటా సేకరణ చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రపంచబ్యాంక్, పంట బీమా, నిపుణులు అభిప్రాయపడ్డారు. ఐవోటీ, శాటిలైట్ చిత్రాల ద్వారా భూగర్భంలో పొరల్లో నీరు ఉందో తెలుసుకుని సమాచారం అందుబాటు లోకి వస్తుందని, దీని ద్వారా రైతులు సులభంగా ఒక అంచనా తో బోర్లు వేసుకుని పరిస్థితి ఉంటుందని తెలియ జేశారు. ఈ సమగ్ర డేటా వల్ల ప్రపంచవ్యాప్తంగా రైతుల నేపథ్యంలో సమ గ్రమైన డేటా వల్ల పురోగతి ఉంటుంది. ఈ సమగ్ర వివరాలు వల్ల ఎగుమతులకు ప్రోత్సాహం ఉంటుంది. లక్ష గ్రామాల డిజి టల్ అనుసంధానం, 32 కోట్ల జన్‌ధన్ ఖాతాల విప్లవం, ‘ఈ నామ్’తో 470 వ్యవసాయ విపణులకు ఏర్పరిచిన అనుబంధం, దేశంలో ఆరు కోట్లమంది డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దే యజ్ఞం.

దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థ స్థాపన లక్ష్యంగా విస్తరణకు భారీ పెట్టుబడులు కేటాయించి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాభివ ద్ధికి ప్రాధాన్యతను ఇచ్చారు. వ్యవసాయ ఉత్పాదకాలలో కీలక మైన నీటిపారుదల, విద్యుచ్ఛక్తి, భారీ పరిశ్రమలు, విద్యా వైద్య రంగాల అభివృద్ధికి ఖుషిచేశారు. వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణ, అభివృద్ధికి వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించి మే లు రకం విత్తనాలు, పంటల సంరక్షణ, పంటల దిగుబడి పెంచ డానికి రసాయన ఎరువులు వాడకం, నూతన ఉత్పాదనలపై పరిశోధనలు చేపట్టి వీటిని కేంద్రాల సమూహంగా సమాచార బదిలీకి అవకాశం కల్పించింది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి కొత్త యోచనలు బలంగా ఉన్నాయి. 62% జనావళికి జీవికగా ఉన్న సేద్య రంగాన్ని శాస్త్ర సాంకేతికతల జోడెడ్లతో బడుగు రైతులకు లాభాల భరోసా ఇచ్చేలా తీర్చడమే లక్ష్యంగా సాగిన ‘ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సాంకేతిక శిఖరాగ్ర సదస్సు’ స్ఫూర్తిమంతంగా ముగిసింది. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయానికి సాంకేతిక తను అనుసంధానించి ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలు, సాంకేతిక ఆవిష్క రణలకు పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోవాలని ఆలోచనలకు అద్దం పట్టింది.రైతులకు అవసరమైన సమాచారం అంతా వారి ఇంటి వద్దకే చేరాలన్న ధోరణి కేంద్ర ప్రభుత్వం పలికింది. చిన్న చిన్న కమతాల రైతుల్ని బ ందాలుగా ఏర్పాటు చేసి, వేల ఎకరాల్లో సామాజిక సాగు ప్రోత్సహిస్తే ఖర్చు గణ నీయంగా తగ్గి భారీగా రైతులకు లాభాలు చేకూరుస్తుంది. వ్యవ సాయం, గ్రామీణాభివృద్ధి, సాగునీటి రంగాలకు ఈ ఏడాది బడ్జెట్లో పెద్దపీట వేసింది. రైతన్నల కుటుంబాల ఆదాయంపై ఆంధ్రప్రదేశ్ దేశంలో 21వ స్థానంలో ఉన్న వాస్తవాన్ని గుర్తించి, అన్నదాతలకు రాబడి పెంపుదలకు సాంకేతిక పరిష్కారాన్ని వేగ వంతం అన్వేషిస్తుంది. సేద్యంలో సౌలభ్యాన్ని శాస్త్రీయతను పెంచేలా రైతుకు బాసటగా 259 కొత్త సాంకేతిక ఆవిష్కరణల ప్రదర్శనలను విశాఖ సదస్సు వేదికైంది. రాష్ట్ర భవిష్యత్తు వ్యవ సాయ ముఖచిత్రాన్ని గుణాత్మకంగా మార్చి చొరవతో యువతరం ముందడుగు వేస్తే వ్యవసాయంలో సౌభాగ్యం సాకార మవుతుంది.

దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ ప్రధానంగా వ్యవసాయ ఆధారి తమైంది. దేశంలో 49 శాతం ప్రజలు ప్రత్యక్షంగా వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉన్నారు. గ్రామీణ, సాంఘిక మౌలిక సౌకర్యాల అభివృద్ధి సరైన విద్య, వైద్య సదుపాయాలతో బలో పేతం చేయవలసి ఉంది. దేశంలో వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ఆర్థికమంత్రి సరైన దిశలోనే దృష్టిపెట్టారు. దీనికోసం రైతులు వారు పండించిన పంటకు సరైన ధర రావాల్సి ఉంటుంది. ఇదే కాకుండా వ్యవ సాయ మార్కెట్ల అనుసంధానతను కూడా బలోపేతం చేయాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్ట కల్పించడం గ్రామాల్లో మౌలి క వసతులను పెంపొందించడం ద్వారా వ్యవసాయా నికి, గ్రా మీణ అభివృద్ధికి దోహదపడుతుంది. ప్రభుత్వ విధాన నిర్ణ యాల్లో ఉద్యోగావకాశాలు సృష్టి ఉద్యోగిత కల్పనకు కీలక ప్రా ధాన్యత లభించింది. ముఖ్యంగా ముద్రరుణాలు, నైపుణ్య శిక్షణ కేంద్రాలను కూడా అభివృద్ధి వంటివి ఉపాధికి అద్దం పడు తున్నాయి. 
 ఎస్. శివారెడ్డి
9866041775

English Title
The farmer's welfare
Related News