గర్వంగా ఉంది : కోహ్లీ

Updated By ManamMon, 02/26/2018 - 03:15
kohli

కోహ్లీకి టెస్ట్ చాంపియన్‌షిప్ గద
kohliకేప్‌టౌన్
: వరుసగా రెండో సారి ఐసిసి టెస్ట్ చాంపియన్ షిప్ అందుకోవటం గర్వంగా ఉందని టీమిండియా కెప్టెన్ కోహ్లీ అన్నాడు. ఈ ఘనత సాధించడానికి భారతజట్టుకు సపోర్ట్‌గా నిలిచిన అభిమానులకు కోహ్లీ ధ్యాంక్స్ చెప్పా డు. ‘మేం ఎక్కడ ఆడినా కష్టమైన సమ యాల్లో మా తోటి ఆట గాళ్లకు  అండగా నిలిచారు, అభిమానులందరికీ  నా ధన్య వాదాలు’అంటూ కోహ్లీ ఐసిసి టెస్ట్ చాంపియన్ షిప్ అందుకున్నాక  ఓ వీడియో సందేశం పంపాడు. ఐసిసీ టెస్ట్ టీమ్ ర్యాంకుల్లో భారత జట్టు అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. కేప్‌టౌన్‌లో శనివారం జరిగిన  టి ట్వంటీ మ్యాచ్  తర్వాత ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్ టీమ్ మెంబర్లు  గవాస్కర్, పొలాక్‌లు ఐసిసి    టెస్ట్ చాంపియన్ షిప్ గదను కోహ్లీకి అందించారు. 6.5 కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ కూడా భారత జట్టుకు లభించింది. టెస్టు ర్యాంకుల్లో వరుసగా రెండో ఏడాది భారత జట్టు టాప్ ప్లేస్‌లో నిలవడం ఆనందగా ఉందని కోహ్లీ చెప్పాడు. ‘టెస్టుల్లో  భారత అద్భుతంగా రాణిస్తోంది. రెండేళ్లుగా అత్యుత్తమ జట్టుగా ఎదుగుతున్నాం, వరుసగా రెండో ఏడాదీ టెస్ట్ చాంపియన్ షిప్ గద అందుకోవటం గర్వంగా ఉంది’ అని కోహ్లీ చెప్పారు. ఈ అవార్డు జట్టుపై మరింత బాధ్యత పెంచుతుందని అన్నాడు.
 

కోహ్లీ  రేర్ రికార్డ్
వెన్నెముక పట్టేయడంతో  దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టి ట్వంటీ సిరీస్‌కు దూరమైనప్పటికీ  భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఒ విదేశీ పర్యటనలో అత్యధిక రన్స్ చేసిన రెండో  ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.  ఈ సిరీస్‌లో టెస్ట్‌లు, వన్డేలు, టి ట్వంటీలు కలిపి మొత్తం 14 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ 871 పరుగులు చేశాడు.  ఈ  జాబితాలో ఇంకు ముందు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 937 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. 2003 ఇంగ్లండ్ పర్యటనలో  గ్రేమ్ స్మిత్ 16 ఇన్నింగ్స్‌లో 937 రన్స్ చేశాడు.

English Title
feeling proud: Kohli
Related News