మహామహ వజ్రం.. భారీ ధర

Updated By ManamTue, 03/13/2018 - 15:53
lesotho legend

lesotho legendప్రపంచంలోనే ఐదో అతిపెద్ద వజ్రం అది. దాని తూకం 910 కారెట్లు. ఆ మహామహ వజ్రం పేరు ‘లెసోథో లెజెండ్’. ఆ వజ్రం ఇప్పుడు సుమారు రూ.259.74 కోట్లకు (40 మిలియన్ డాలర్లు) అమ్ముడుపోయింది. ఆంట్వెర్ప్‌లోని జెమ్ డైమండ్స్ లిమిటెడ్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. సంస్థ ఆఫ్రికాలోని లెట్సెంగ్‌లో గల తన వజ్రాల గనిలో తవ్వుతుండగా రెండు గోల్ఫ్ బంతుల పరిమాణం కలిగిన ఈ లెసోథో లెజెండ్ దొరికింది. ఇక, పరిమాణంలో ఈ వజ్రానిది ఐదో స్థానం. అంతకన్నా ముందు పలు సంస్థలు అంతకన్నా పెద్ద వజ్రాన్ని భారీ ధరకే అమ్మాయి. గత ఏడాది లుకారా డైమండ్ కార్పొరేషన్ అనే సంస్థ తనకు లభించిన 813 కారెట్ల భారీ వజ్రాన్ని సుమారు రూ.408.9 కోట్ల (63 మిలియన్ డాలర్లు)కు అమ్ముకుంది. అదే ఏడాది దొరికిన 1013 కారెట్ల మరో వజ్రాన్ని సుమారు రూ.344 కోట్లకు (53 మిలియన్ డాలర్లు) అమ్ముకుంది. కాగా, భారీ, నాణ్యమైన వజ్రాలకు లెట్సెంగ్ గని పెట్టింది పేరు. అక్కడ లభించిన వజ్రాలు ప్రపంచంలోనే అత్యధిక ధర పలుకుతాయి. 

English Title
The fifth largest diamond sold for 40 million dollars
Related News