రిటైర్మెంట్ తీసుకోనున్న రామ్-లక్ష్మణ్

Updated By ManamWed, 09/12/2018 - 14:37
Ram- Lakshman

Ram- Lakshmanఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఫైట్స్ అందించిన టాలీవుడ్ ఫైట్ మాష్టర్స్ రామ్- లక్ష్మణ్ త్వరలో రిటైర్మెంట్ తీసుకోనున్నారు. ఈ విషయాన్ని ఆ ఇద్దరు వెల్లడించారు. త్వరలో సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకొని, తమ గ్రామానికి వెళ్లి సాధారణ జీవితాన్ని గడపాలనుకుంటున్నామని రామ్- లక్ష్మణ్ తెలిపారు. 

కాగా 2001లో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన రామ్- లక్ష్మణ్‌లు 1100పైగా సినిమాలకు ఫైట్స్ అందించారు. ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. పలు చిత్రాల్లో కూడా నటించారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’తో పాటు మహేశ్ బాబు ‘మహర్షి’, విజయ్ ‘సర్కార్’ చిత్రాలకు పనిచేస్తున్నారు. 

English Title
Fight Masters Ram-Lakshman to retire from films
Related News