సుప్రీంలో తేలుద్దాం

Updated By ManamSat, 07/07/2018 - 02:57
cm babu
  • ప్రత్యేక హోదా వాదన  వినిపిస్తాం.. కేంద్రం దుర్నీతిని ఎండగడతాం

  • న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం.. కేబినెట్‌లో మంత్రుల అభిప్రాయం

  • ఇళ్లలో లేబర్ కాంపొనెంట్ సర్కారుదే.. ప్రభుత్వంపై రూ.1480 కోట్ల భారం

cm babuఅమరావతి: ‘‘కేంద్రం ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంపై కక్షపూరితంగా ప్రవర్తిస్తోంది. విభజన చట్టంలో ఉండి హక్కుగా ఏపీకి రావాల్సిన వాటిపై కూడా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోంది. అన్ని రాష్ట్రాల మాదిరిగా, రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఏదో ఒక విధంగా అడ్డుకుంటోంది. అదీ చాలదన్నట్లు సుప్రీంకోర్టులోనూ తప్పుడు లెక్కలతో అఫిడవిట్ దాఖలు చేయడం దారుణం. మనం మౌనం వహించడం మంచిది కాదు. న్యాయనిపుణులతో చర్చించి సుప్రీంకోర్టును ఆశ్రయిద్దాం. కేంద్ర దుర్నీతిని కోర్టులో ఎండగడతాం. కేంద్రంపై పోరాడేందుకు ఎంతవరైకెనా వెళదాం. సుప్రీంకోర్టులోనే కేంద్రంపై అమీతుమీ తేల్చుకుందాం’’ అని మంత్రివర్గ సమావేశంలో పలువురు మంత్రులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర నిర్లక్ష్యపూరిత వైఖరిపై కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సమావేశ విశేషాలను సవుచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు విలేకరులకు వెల్లడించారు. ‘‘తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విభజన చట్టం అమలుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన వాదనను వినిపించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో కేంద్రం అసత్యాలతో అఫిడవిట్ దాఖలు చేసింది. ఉన్నత న్యాయుస్థానంలోనే, కేంద్రం అసత్యాలు చెబితే ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం. ఆర్థిక లోటు రూ.16 వేల కోట్లు ఉందని ఎప్పటినుంచో ఏపీ అడుగుతున్నా, రూ.4వేల కోట్లేనని.. అది ఇచ్చేశామని చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తోంది. రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి కొండంత ఆశిస్తే, రవ్వంత ఇచ్చింది. 9,10 షెడ్యూల్‌లో ఉన్న సంస్థల్లోనూ పరిష్కార మార్గాలు చూపించకుండా అన్ని అంశాలు పరిష్కరించామని చెబుతోంది. ప్రత్యేక హోదా, విభజన చట్టంలో రాష్ట్రానికి రావాల్సిన అన్ని అంశాలపై సుప్రీంకోర్టుకు వెళతాం. విభజనచట్టం హామీల అమలుకు ఎంత దూరై మెనా పోరాడాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో కార్యాచరణపై చర్చించాం. న్యాయనిపుణులతో చర్చించి త్వరలో సుప్రీంకోర్టు తలుపు తడతాం’’ అని మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. 

పాత్రికేయుల ఇళ్లకు కేబినెట్ ఆమోదం
రాష్ట్రంలో పాత్రికేయుల ఇళ్ల నిర్మాణ పథకానికి కేబినెట్  శుక్రవారం ఆమోదం తెలిపింది. దీనికోసం ఇప్పటికే రాష్ట్ర ఆర్థికశాఖ రూ.100 కోట్లు కేటాయించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విలేకరులకు ప్రభుత్వం ఇచ్చే రూ.1.50 లక్షలకు అదనంగా, రాష్ట్రప్రభుత్వం మరో రూ. లక్ష ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇస్తావున్నారు. పట్టణాలు.. నగరాల్లో ఉన్న రిపోర్టర్లకు వివిధ విధానాల ద్వారా ఇళ్లు కేటాయింపులు చేస్తామని తెలిపారు. నగరాల్లో సొంత స్థలాలు ఉన్న వారికి రెండున్నర లక్షలతో పాటు ప్రభుత్వం మరో లక్షన్నర సబ్సిడీగా ఇవ్వాలని నిర్ణయించిందని.. టిడ్కో సంస్థ కట్టించే బహుళ అంతస్తుల్లో ఇళ్లు కావాలనుకునేవారికి ప్రభుత్వ రాయితీ మూడు లక్షలు, సౌకర్యాలకు రూ. లక్షతో పాటు అదనంగా లక్షన్నర కలిపి ఐదున్నర లక్షలు సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. స్థలాలు లేని జర్నలిస్టులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కాల్వ విజ్ఞప్తి చేశారు. నిరుపేదలకు పెద్ద ఎత్తున శాశ్వత ఆవాసయోగం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇబ్బందులను అధిగమిస్తూ లక్షలాది ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలను శరవేగంగా చేస్తున్నామని చెప్పారు. నాలుగు లక్షల ఇళ్లను పండుగ వాతావరణంలో వేలాది ప్రముఖల భాగస్వామ్యంలో ప్రారంభం చేసుకున్నామని పేర్కొన్నారు. గ్రామీణప్రాంతాలలో లేబర్, మెటిరియల్ కాంపొనెంట్‌లో ఇచ్చే రూ.25,540 బిల్లులు కేంద్రం నుంచి సకాలంలో రావడం లేదని, దీని వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆ మొత్తాన్ని ఉపాధి హామీ నిధులతో సంబంధం లేకుండా రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చెల్లించేలా ప్రభుత్వం అనువుతించిందన్నారు. దీనివల్ల ప్రభుత్వంపై రూ.1480 కోట్లు అదనపు భారం పడుతుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో టిడ్కో సంస్థ నిర్మిస్తున్న ఇళ్ల స్థల సేకరణకు  స్టాంపుడ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇస్తూ మంత్రి మండలి తీర్మానాన్ని ఆమోదించింది. పట్టణల్లో ఆక్రవుణాలకు గురైన వాటికి, నిబంధనల ప్రకారం క్రవుబద్ధీకరించేందుకు ఆమోదం తెలిపింది. 

ఐఆర్‌ఈపీకి 4766 ఎకరాలు
గ్రీన్‌కో సంస్థకు ఐఆర్‌ఈపీ ప్రాజెక్టు కోసం కర్నూలు జిల్లా పాణ్యంలో ప్రభుత్వం 4766 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ అనుమతి ఇచ్చింది. ఐఆర్‌ఈపీ కింద వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్, 500 మెగావాట్ల పవన్ విద్యుత్, పంపుడ్ స్టోరేజ్ కెపాసిటీకి ఒక టీఎంసీ నీటిని కేటాయించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు వల్ల నిర్మాణ దశలో 15వేల మందికి, ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత మూడు వేల మందికి ఉపాధి అవకాశం లభించనుంది. 

2018-20 నూతన ఐటీ పాలసీ
రాష్ట్ర ఐటీ పాలసీలోనూ ప్రభుత్వం మార్పులు చేసింది. 2018-20కు సంబంధించి కొత్త ఐటీ పాలసీని తీసుకొచ్చింది. దీనికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ విధానం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించి ఐటీ పరిశ్రమలను ఆకర్షించి, ఏడాదికి లక్ష ఉద్యోగాలను తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తోంది. ఐటీ వల్ల జీఎస్‌డీపీ రూ.6500 కోట్లు ఉండాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోంది. కర్నూలులో అబ్దుల్‌హక్ యూనివర్సిటీలో 35 మంది టీచింగ్, నలుగురు బోధనేతర సిబ్బందిని నియుమించుకునేందుకు యూనివర్సిటీ అనుమతి ఇచ్చింది.  బీసీ కార్పొరేషన్‌లకు మేనేజింగ్ కమిటీకి సిబ్బంది నియామకానికి అనుమతి ఇచ్చింది.

English Title
fight in supreme court
Related News