ఫైనల్ రేస్

Updated By ManamTue, 03/13/2018 - 23:44
indian-cricket-team

indian-cricket-teamకొలంబో :  శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్‌లో సాధించిన విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత జట్టు నిదహాస్ కప్-2018 టోర్నీలో  ఫైనల్ బెర్త్‌ను  ఖాయం చేసుకునేందుకు బుధవారం బంగ్లాదేశ్‌తో చివరి లీగ్ మ్యాచ్‌ను ఆడుతుంది.  శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 215 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన బంగ్లాతో మ్యాచ్‌ను భారత జట్టు తేలిగ్గా  తీసుకునే అవకాశాలు కనిపించటం లేదు. తొలి మ్యాచ్‌లో లంక చేతిలో ఓడినప్పటికీ ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌లో గెలుపొందిన రోహిత్ శర్మసారథ్యంలోని భారత్ ఈ ముక్కోణపు వన్డే టోర్నీ ఫైనల్ చేరే అవకాశాన్ని సుగమం చేసుకుంది. ఒక వేళ ఈ మ్యాచ్‌లో ఫలితం తారుమారైనా భారత్‌కు పెద్దగా నష్టం లేదు. శుక్రవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక -బంగ్లా జట్లు పోటీపడతాయి. ఆ మ్యాచ్ ఫలితం తర్వాత  దీంతో నెట్ రన్‌రేట్ ఆధారంగా  ఫైనల్ చేరే జట్లను నిర్ణయిస్తారు. ఇప్పటికే భారత్ మెరుగైన రన్‌రేట్ (+0.21)తో టాప్ ప్లేస్‌లో ఉంది.  భారత జట్టులో  ఓపెనర్ శిఖర్‌ధావన్ బ్రహ్మాండంగా రాణిస్తున్నప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఇంకా ఫామ్‌లోకి రాలేదు. రోహిత్ వరుసగా  విఫలమవడం మిగతా బ్యాట్స్‌మెన్‌పై భారం పడుతోంది.   సురేశ్ రైనా, మనీష్ పాండే మిడిలార్డర్‌లో ఫర్వాలేదనిపిస్తున్నారు. వీరికి తోడు దినేశ్ కార్తీక్ , రిషబ్ పంత్‌లు కూడా బ్యాట్‌కు పదును పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. శ్రీలంకతో జరిగినమ్యాచ్‌లో కార్తీక్ 39 రన్స్  చేసి ఫామ్‌లోకి రావటం భారత శిబిరంలో కొత్త ఉత్సాహం తెచ్చిపెట్టింది. ఇక భారత్ బౌలింగ్ విభాగంలో ఎలాంటి ప్రయోగాలు చేయకపోవచ్చు. దీపక్ హుడా,  సిరాజ్, అక్షర్ పటేల్  లాంటి యువ బౌలర్లకు ఇంకా అవకాశం రానప్పటికీ ఈ మ్యాచ్‌లోనూ ఆడే ఛాన్స్ దక్కకపోవచ్చు.  విజయ్‌శంకర్, పాండ్యా,  శార్థూల్ ఠాకూర్‌లు చక్కగా రాణిస్తుండటంతో ఈ మ్యాచ్‌లోనూ వారికి ఆడే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.  ఇక బంగ్లా జట్టు విషయానికొస్తే భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 139 రన్స్ మాత్రమే చేసిన జట్టు ఆ తర్వాత శ్రీలంకతో  జరిగిన మ్యాచ్‌లో 215 పరుగుల లక్ష్యాన్ని సాధించి ఎలాంటి సంచలనమైనా సాధించగలదని నిరూపించింది.  తమిమ్ ఇక్బాల్, లిటోన్ దాస్, ముషాఫికర్ రెహ్మాన్ శ్రీలంక  బౌలర్లపై విరుచుకుపడి భారీ టార్గెట్‌ను చేజ్ చేసి భారత శిబిరంలో కలవరం రేపారు.  ఇలాంటి పరిస్థితుల్లో  ఈ చివరి లీగ్ మ్యాచ్‌లో ప్రయోగాల జోలికెళ్లకుండా ఉండటమే మేలని భారత్ భావిస్తోంది. 

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్‌ధావన్ (వైస్‌కెప్టెన్), లోకేశ్ రాహుల్, సురేశ్ రైనా, మనీష్ పాండే, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, చాహల్, అక్షర్ పటేల్, విజయ్ శంకర్,  శార్థూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, రిషబ్ పంత్.బంగ్లాదేశ్ : మహ్మదుల్లా (కెప్టెన్), తమిమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, ఇమ్రుల్ కయాజ్, ముసాఫికర్ రెహ్మాన్ (వికెట్ కీపర్), షబ్బీర్ రెహ్మాన్, షబ్బీర్ రెమ్మాన్,  ముస్తాఫిజుర్ రెహ్మాన్, రుబెల్ హుస్సేన్,  తస్కిన్ అహ్మద్, అబు హైదర్, అబు జయేద్. అరిఫుల్ హక్, నజిముల్ ఇస్లామ్, నూరుల్ హసన్, మెహిదీ హసన్, లిటన్ దాస్.
సాయంత్రం 7 గంటల నంచి డి. స్పోర్ట్స్,  డిడి స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం.

ధోని రికార్డు బ్రేక్
చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన సురేశ్ రైనా సోమవారం కొలంబోలో జరిగిన టి20 మ్యాచ్‌లో  మాజీ కెప్టెన్ ధోని రికార్డును దాటేశాడు. అంతర్జాతీయ టి20ల్లో అత్యధికపరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో మూడో స్థానంలో నిలిచాడు.ఇ ప్పటిదాకా భారత్ తరపున టి20ల్లో ధోనీ 1444 రన్స్‌తో మూడో స్థానంలో ఉండగా, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగులు చేసిన రైనా 1452 రన్స్ చేశాడు. ఈ జాబితాలో కోహ్లీ (1983 రన్స్), రోహిత్ శర్మ (1696 రన్స్)  తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

లోకేశ్ రాహుల్ హిట్ వికెట్ రికార్డు
కొలంబోలో సోమవారం శ్రీలంకతో  జరిగిన టి20 లీగ్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ లోకేశ్ రాహుల్ అరుదైనరికార్డును సొంతం చేసుకున్నాడు. జీవన్ మెండిస్ వేసిన బంతిని ఆడేందుకు ప్రయత్నించిన రాహుల్ వికెట్లను తగిలి హిట్‌వికెట్‌గా అవుటయ్యాడు.  దీంతో టి20ల్లో హిట్‌వికెట్ అయిన తొలి క్రికెటర్‌గా రాహుల్ రికార్డులో కెక్కాడు. టెస్టుల్లో లాలా అమర్‌నాథ్, వన్డేల్లో మోంగియాలు ఈ  రికార్డుల్లో ఉన్నారు.

English Title
Final Race
Related News