రూపాయి కదలికలనూ ఓ కంట కనిపెట్టండి

Updated By ManamSat, 04/14/2018 - 22:54
rupee

rupeeవాషింగ్టన్: ప్రశ్నించదగిన విదేశీ మారక ద్రవ్య విధానాలను అనుసరించడానికి అవకాశం ఉన్న దేశాల పరిశీలన జాబితాలో చైనా, మరో నాలుగు దేశాలతోపాటు ఇండియాను కూడా అవెురికా ట్రెజరీ చేర్చిందని శనివారం నాడిక్కడ విడుదలైన ఒక నివేదిక వెల్లడించింది. ‘‘ప్రధాన వర్తక భాగస్వాముల్లో కరెన్సీ విధానాలను సన్నిహితంగా పరిశీలించవలసిన అవసరం ఉందని భావించిన’’ వాటిని ‘‘పరిశీలన జాబితా’’లో చేర్చినట్లు ట్రెజరీ పేర్కొంది. ఈ జాబితాలో అక్టోబరు నుంచి ఇండియాతోపాటు చైనా, జర్మనీ, జపాన్, కొరియా, స్విట్జర్లాండ్‌లు  కొనసాగుతున్నట్లు కాంగ్రెస్‌కు సమర్పించిన పాక్షిక-వార్షిక నివేదికలో వెల్లడించారు. వరుసగా రెండు విడతల నివేదికలలో ఉన్న దేశాల ‘‘పనితీరు వెర్సస్ ప్రమాణాలలో ఏపాటి మెరుగుదలైనా  తాత్కాలిక అంశాల వల్ల కాక, కొనసాగేదిగా ఉండేట్లు చూసేందుకు’’ అవెురికా ఈ ఏర్పాటు చేసింది. ప్రధాన వాణిజ్య భాగస్వాములలో ఏ దేశమూ కరెన్సీ విలువను పెంచుకునే మాయోపాయాలకు పాల్పడుతున్నట్లు తేలలేదు. కానీ, జాబితాలోని దేశాలలో ఐదు దేశాల వ్యవహార శైలి మూడు గీటురాళ్ళలో రెండింటికి సరిపోలేదిగా ఉంది.  ‘‘మొత్తం మీద అవెురికా వాణిజ్య లోటులో అర్హతకు మించిన వాటాకు’’ కారణమవుతున్నందుకు చైనాను ఈ జాబితాలో చేర్చారు. మొత్తం ప్రపంచ వాణిజ్య లోటు 566 బిలియన్ల డాలర్లలో 337 బిలియన్ల డాలర్ల లోటు ఒక్క చైనాతోనే అవెురికాకు ఉందని ప్రభుత్వ డాటా వెల్లడిస్తోంది. ‘‘మేం పరిశీలనను కొనసాగిస్తూ అసమంజస కరెన్సీ విధానాలపై పోరాడతాం. భారీ స్థాయిలో ఉన్న వాణిజ్య అసమతౌల్యాలను పరిష్కరించేందుకు అనుసరించే విధానాలను, సంస్కరణలు ప్రోత్సహిస్తాం’’ అని అవెురికా ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్ మినూచన్ ఒక ప్రకటనలో తెలిపారు. వాణిజ్యంలో సానుకూలత పొందేందుకు తమ కరెన్సీ విలువను కృత్రిమంగా నిర్వహించేందుకు ప్రయత్నించే దేశాలను గుర్తించేందుకు కాంగ్రెస్‌కు ఈ ట్రెజరీ నివేదిక అవసరమవుతోంది. ఉదాహరణకు, చౌక ఎగుమతులను పెంపొందించేందుకు మారకం రేటు తక్కువగా ఉండేట్లు చూడవచ్చు. 

అవెురికాతో ఇండియా 23 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు కలిగి ఉంది. రూపాయి విలువ పెరుగుతూ వస్తున్నా, ‘‘2017 మొదటి మూడు త్రైమాసికాలలో (ఇండియా) విదేశీ మారక ద్రవ్య కొనుగోళ్ళను పెంచింది’’ అని నివేదిక పేర్కొంది. వాషింగ్టన్‌తో రేగుతున్న వాణిజ్య వివాదానికి కేంద్రంగా ఉన్న చైనా కూడా జాబితాలో కొనసాగుతోంది. అవెురికాతో చైనా వాణిజ్య మిగులును తగ్గించడంలో సహాయపడే విధంగా సాగాల్సింది పోయి ‘‘చైనా కరెన్సీ సాధారణంగా వ్యతిరిక్త  దిశలో సాగుతోంది’’ అని ట్రెజరీ పేర్కొంది. దిగుమతులకన్నా ఎగుమతుల విలువ  ఎంత ఎక్కువగా ఉంటే అది ఆ దేశ వాణిజ్య మిగులు అవుతుంది. యూరోపియన్ కరెన్సీ యూనియున్‌లో భాగంగా ఉన్నప్పటికీ, జర్మనీ కూడా ఈ జాబితాలో ఉంది. నిజానికి, యూరో మారకం రేటును జర్మనీ స్వతంత్రంగా నియంత్రించగలిగిన స్థితిలో లేదు. జర్మనీకి ‘‘ప్రపంచంలో అతిపెద్ద కరెంట్ అకౌంట్  మిగులు ఉంది’’ అని నివేదిక తెలిపింది. ‘‘ఈ భారీ మిగులును తగ్గించుకోవడంలో గత మూడేళ్ళలో అది సాధించిన ప్రగతి నామమాత్రం లేదా బొత్తిగా ఏమీ లేదని చెప్పాలి’’ అని నివేదిక వ్యాఖ్యానించింది. మిగులును పరిష్కరించేందుకు ఆర్థిక సంస్కరణలను అమలు చేయవలసిందిగా జాబితాలో ఉన్న దేశాలకు ట్రెజరీ విజ్ఞప్తి చేసింది.

Tags
English Title
Find out the rupee movements
Related News