కోహ్లీకి జరిమానా

Updated By ManamFri, 04/27/2018 - 02:02
IMAGE

imageబెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగ ళూరు సారథి విరాట్ కోహ్లీకి ఐపీఎల్ రూ.12లక్షల జరిమానా విధించింది. టోర్నీలో భాగంగా బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య మ్యాచ్‌లో 206 పరుగుల భారీ లక్ష్యాన్ని చెన్నై ఛేదించి 5 వికెట్లతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత సమయానికి ఓవర్లు వేయలేక పోయింది. దీంతో ఆర్‌సీబీ సారథి విరాట్ కోహ్లీకి రూ.12లక్షల జరిమానా విధించారు. ‘ఆర్‌సీబీ జట్టు ఐపీఎల్ ఓవర్ రేట్ నియమావళిని అతిక్రమించింది. ఇలా చేయడం ఈ జట్టుకు ఇదే తొలిసారి. ఈ కారణంగానే ఆ జట్టు సారథి విరాట్ కోహ్లీకి రూ.12లక్షల జరిమానా విధిస్తున్నాం’ అని ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు.

English Title
Fine for Kohli
Related News