రహానేకు షాక్

Updated By ManamTue, 05/15/2018 - 00:27
rahane

రూ.12 లక్షల ఫైన్
ముంబై: రాజస్థాన్ రాయల్స్ సారథి అజింక్య రహానేపై ఐపీrahaneఎల్ నిర్వాహకులు రూ.12లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్ 11వ సీజన్‌లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా ముంబైలో ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు నెమ్మదిగా ఓవర్లు వేశారు. అనుకున్న సమయంలో వారు తమ ఇన్నింగ్స్‌ను పూర్తి చేయలేకపోయారు. దీంతో టోర్నీ నిర్వాహకులు ఆ జట్టు సారథి రహానెకు రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. ఐపీఎల్‌లో స్లో ఓవర్ రేట్ నిబంధనను అతిక్రమించడం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఇదే తొలిసారి. అందుకే ఆ జట్టు సారథి రహానెకు జరిమానా విధిస్తున్నాం’ అని  ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించడం ఇది రెండోసారి. చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీకి రూ.12 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ టోర్నీలో భాగంగా మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పోటీపడుతుంది.

English Title
fine to rahane
Related News