అవెురికా బార్‌లో కాల్పులు

Updated By ManamFri, 11/09/2018 - 01:40
america-fire
  • పొగబాంబు వేసి హ్యాండ్‌గన్‌తో కాల్పులు

  • 13 మంది మృతి... పలువురికి గాయాలు

  • క్షతగాత్రులలో పోలీసు.. ఆస్పత్రికి తరలింపు

america-fireథౌజండ్ ఓక్స్ (అవెురికా): అవెురికాలో మరోసారి తుపాకి సంస్కృతి రెచ్చిపోయింది. దక్షిణ కాలిఫోర్నియాలో జనంతో కిటకిటలాడుతున్న ఓ బార్‌లో నిందితుడు జరిపిన కాల్పుల్లో 12 మంది మరణించారు. అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో కాల్పులు జరిపిన దుండగుడు కూడా మరణించాడు. ఈ కాల్పుల్లో ఒక పోలీసు సైతం మరణించినట్లు వెంచురా కౌంటీ షెరిఫ్ ఆఫీసు కెప్టెన్ కురెడ్జైన్ తెలిపారు. అవెురికా కాలమానం ప్రకారం రాత్రి 11.20 గంటల సమయంలో థౌజండ్ ఓక్స్ నగరంలోని బోర్డర్ లైన్ బార్ అండ్ గ్రిల్‌లో కాల్పులు మొదలైనట్లు తెలిసిందన్నారు. ఈ నగరం లాస్ ఏంజెలిస్‌కు పశ్చిమంగా 40 మైళ్ల దూరంలో ఉంటుంది. పోలీసులకు విషయం తెలిసి అక్కడకు వెళ్లేసరికి ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో కాల్పులు జరిపిన దుండగుడు సహా 13 మంది మరణించగా ఇంకా చాలామందికి బుల్లెట్ గాయాలయ్యాయి. ముందుగా పొగబాంబులు విసిరిన నిందితుడు.. ఆ తర్వాత హ్యాండ్‌గన్‌తో కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు ఏబీసీ న్యూస్‌కు తెలిపారు. కనీసం 30 రౌండ్లు అతడు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. బార్ వద్ద ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ వాళ్లంతా ఒక పార్టీ ఏర్పాటుచేసుకోవడంతో ఎక్కువ సంఖ్యలో యువతీ యువకులే అక్కడకు చేరుకున్నట్లు స్థానిక మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది

Tags
English Title
Fire in the Avarika Bar
Related News