‘హలో గురు ప్రేమకోసమే’ మొదటి పాట విడుదల 

Updated By ManamMon, 09/24/2018 - 17:13
HGPK

HGPKరామ్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా ‘నేను లోకల్’ ఫేమ్ త్రినాథరావు తెరకెక్కించిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ అందరినీ ఆకట్టుకోగా.. తాజాగా మొదటి పాటను విడుదల చేశారు. మై వరల్డ్ ఈజ్ ఫ్లైయింగ్ అంటూ సాగే ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా.. ఆల్ఫోన్స్ జోసెఫ్ పాటను ఆలపించారు. హీరోయిన్‌ను చూసి హీరో తన ఫీలింగ్‌ను చెప్పేలాగా వచ్చిన ఈ పాట యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, ప్రణీత తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

English Title
First Song released from Hello Guru Prema Kosame
Related News