మహాశివరాత్రి పర్వదినాన చిత్తూరులో విషాదం

Updated By ManamTue, 02/13/2018 - 11:17
మహాశివరాత్రి పర్వదినాన చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం

road accident at tirupatiతిరుపతి: మహాశివరాత్రి పర్వదినాన చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని బిఎన్ కండ్రిగ మండలం మయూర షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో వేగంగా వచ్చిన టిప్పర్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. 

మంగళవారం తెల్లవారుజామున శ్రీకాళహస్తి వాయలింగేశ్వరుని దర్శించుకొని తిరిగి కూలి పనులకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. మృతుల్లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు భార్యభర్తలు, చిత్తూరు జిల్లా యదమర్రి మండలానికి చెందిన అక్కాతమ్ముళ్లు ఉన్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

English Title
five dead and three injured in Tipper- lorry accident tirupatiRelated News