‘రంగస్థలం’.. ఆ ఐదు పాత్రలే కీలకమట

Updated By ManamTue, 03/13/2018 - 21:33
rangasthalam

rangasthalamరామ్ చరణ్, సమంత నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘రంగస్థలం’. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. కాగా, ఈ నెల 18న వైజాగ్‌లో జరగబోయే ముందస్తు విడుదల వేడుక (ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌)ను చాలా అట్టహాసంగా ప్లాన్ చేసింది చిత్ర బృందం. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తన లైవ్ పెర్ఫార్మెన్స్‌తో అభిమానులను అలరించనున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా కథ ప్రధానంగా ఐదు పాత్రల చుట్టూనే తిరుగుతుందని సమాచారం. చరణ్, సామ్ పాత్రలతో పాటు ఆది పినిశెట్టి, జగపతిబాబు, అనసూయ పాత్రలు కథలో చాలా కీలకమని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న  ప్రేక్షకుల ముందుకు రానుంది.

English Title
five important characters from 'rangasthalam'
Related News