విచ్చుకునే టీ 

Updated By ManamThu, 09/06/2018 - 01:38
flower tea

imageమనసంతా అదోలా ఉంది.. బయటికి వెళ్లాలని లేదు.. ఏం చేయాలో దిక్కుతోచలేదు.. ఇలాంటి సందర్భాలకు విరుగుడుగా మీ మనసును ఆకట్టుకునేలా చేసే శక్తి ఒక కప్పు స్పెషల్ టీకు మాత్రమే ఉంది.  కాసిన్ని నీళ్లు బాగా మరిగించి, టీ కప్పులు పోసి, అందులోకి టీ బ్యాగ్ ముద్దను వేస్తే సరి..అది చూస్తుండగానే పువ్వులా విచ్చుకుని మీకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇక ఈ అరోమా మీ మనసును తేలిక చేస్తుంది.  ఘుమఘుమలాడే ఈ చాయ్‌ను తాగితే ఫ్రెష్‌గా ఫీల్ అవుతారు. 
 

image


ఖరీదైన గిఫ్టు
మీకు నచ్చే పూలతో తయారయ్యే ఈ పుష్పాల తేనీరు చాలా ఖరీదైన గిఫ్టుగా మారింది.  మీకు నచ్చినవారికి దీన్ని ఇచ్చి ఆశ్చర్యపరచవచ్చు. 

imageఅమెజాన్‌తో పాటు అన్ని ప్రముఖ స్టోర్స్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి.  ఫ్లవరింగ్ టీ, టీ ఫ్లవర్స్, ఫ్లవర్ టీ బాల్, బ్లూమింగ్ టీ పేరుతో మార్కెట్‌లో సందడి చేస్తున్న తేయాకు సాచెట్లు హెర్బల్ టీ, గ్రీన్ టీ, మసాలా టీ వంటి వివిధ రుచుల్లో ఉంటాయి.  ఆరోగ్యానికి మంచిది కనుక దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది.  ఖరీదైన దీన్ని కొనేబదులు సొంతంగా ఇంట్లోనే అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. 

నవాబీ చాయ్‌గా పేరుగాంచిన పలు టీ వెరైటీలు ఎప్పటినుంచో మన సంప్రదాయంలో భాగంగా ఉండగా ఆర్గానిక్ పేరుతో ఇప్పుడివి మార్కెట్లోకి వచ్చిచేరాయి.

ఇలా చేసి చూడండి
ఒరిజినల్ వెనీలా (కెమికల్ ఎస్సెన్స్ కాదు)ను కొని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకుంటే దాన్ని టీలో కలిపితే వెనీలా టీ రెడీ. ఇకimage పసుపు, మసాలాలు, తులసి, నిమ్మ, అల్లం వంటి వాటితో చేసే టీలు మనం నిత్యం సేవిస్తూనే ఉంటాం. వీటికి భిన్నంగా ఉండాలంటే చేమంతి, మందారం, గులాబీ, మల్లె ఇలా మీకు నచ్చిన పూల రెక్కలను తీసుకుని టీ డికాషిన్‌లో వేసి మరిగించండి. లేదంటే సర్వ్ చేసేముందు టీ పై ఈ పూల రెక్కలు వేసి తాగితే వచ్చే రుచి కమ్మగా ఉంటుంది. మల్లె వంటి వి సీజన్‌లోనే లభిస్తాయి కనుక మంచి సువాసన ఉన్న మల్లె రెక్కలను ఎండబెట్టి, వాటిని టీ పొడితో కలిపి డిప్ బ్యాగ్‌లా ప్యాక్ చేస్తే సరిపోతుంది. వర్షాకాలం, చలికాలం ఇవి మీకు ఆయుర్వేద ఔషధాల్లా పనిచేసి సరికొత్త జోష్ నింపుతాయి.  ఆరోగ్యానికి, అందానికి దివ్యౌషధమైన పూల టీలు సేవించడం మంచి వ్యసనం.

English Title
flower tea
Related News