టెక్సాస్‌లో ఫ్లూ విజృంభణ

Updated By ManamMon, 02/19/2018 - 03:10
flu
  • 4 వేలు దాటిన మరణాలు.. ఇంకా తగ్గని వ్యాధి తీవ్రత

  • వ్యాక్సిన్ తప్పనిసరి.. నిపుణుల సూచన

fluహ్యూస్టన్: టెక్సాస్‌లో విజృంభించిన ఫ్లూ మహమ్మారి కారణంగా మొత్తం నాలుగు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పో యారని అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. వ్యాధి తీవ్రత ఇప్పటికీ ఉన్న నేపథ్యంలో మర ణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈమేరకు టెక్సాస్ స్టేట్ హెల్త్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్(డీఎస్‌హెచ్‌ఎస్) ప్రతినిధి మృతుల వివరాలను మీడియాకు వెల్లడించారు. ఇటీవల జరిపిన పరిశీ లనలో ఫ్లూ కారణంగా ఎంతమంది మరణించారనే లెక్కలు తీయగా.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,153 మంది మరణించారని తేలిందన్నారు. ఈ పరిశీలనకు డెత్ సర్టిఫికెట్‌ను ప్రామాణికంగా తీసుకోవడం వల్ల కొన్ని వారాల క్రితం సమాచారం లభ్యమైందని.. ఈ సమయంలో మరికొంతమంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని డీఎస్‌హెచ్‌ఎస్ ప్రతినిధి లారా అంటోన్ తెలిపారు. కాగా, ఇటీవలి కాలంలో ఫ్లూ లక్షణాలతో వైద్యులను ఆశ్రయించేవారి సంఖ్య తగ్గడం శుభసూచక మని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇంతటితో ఫ్లూ సమస్య ముగిసిం దనే నిర్ణయానికి రావడం వీలుకాదని చెప్పారు. ఇంకా కొన్ని ప్రాంతా ల్లో వ్యాధి ప్రభావం ఎక్కువగానే ఉందని వివరించారు. ఈ క్రమంలో ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని ప్రజలకు లారా సూచించారు. ఈ వ్యాక్సిన్ ఫ్లూలోని కొత్త వైరస్ (హెచ్1ఎన్2) సహా అన్ని రకాల వైరస్‌లను కొంతమేర అడ్డుకుం టోందని చెప్పారు. ఆరు నెలల నుంచి ఎనిమిదేళ్ల చిన్నారుల విషయంలో వ్యాక్సిన్ ప్రభావం దాదాపు సగానికి పైనే ఉంటోందని లారా వివరించారు.

Tags
English Title
Flu boom in Texas
Related News