టీఆర్ఎస్‌కు ముఖ్య నేత గుడ్‌బై?

Updated By ManamSat, 09/08/2018 - 20:31
Former MP, Ramesh Rathode, TRS Party, Kanapur TRS candidate 

Former MP, Ramesh Rathode, TRS Party, Kanapur TRS candidate ఆదిలాబాద్: టీఆర్‌ఎస్‌లో టికెట్ల దక్కని నేతల్లో అసంతృప్తి జ్వాల రగులుతోంది. కేసీఆర్ పక్కన పెట్టిన అసంతృప్తి నేతలు మెల్లగా పార్టీ నుంచి జారుకుంటున్నారు. ఖానాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా రేఖనాయక్‌ను ప్రకటించడంపై మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన టీఆర్‌ఎస్‌కు గుడ్‌ బై చెప్పే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. తనను ఇతర పార్టీలు ఆహ్వానిస్తున్నాయని, త్వరలోనే ఏ పార్టీలో చేరే విషయమై నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు.

తన అనుచరుల సూచన మేరకు ఖానాపూర్ నుంచే పోటీ చేస్తానని రాథోడ్ స్పష్టం చేశారు. ‘‘టీఆర్‌ఎస్‌కు నా బలం ఏంటో చూపిస్తా. టికెట్ హామీతోనే నేను టీఆర్ఎస్‌లో చేరాను. నాకు అన్యాయం చేశారు. ఖానాపూర్ నియోజకవర్గం రేఖానాయక్ జాగీరు కాదు. కమీషన్ల కోసం ప్రజాప్రయోజనాలను రేఖానాయక్ తాకట్టు పెట్టారు’’ అని రాథోడ్‌ విమర్శించారు. 

English Title
Former MP Ramesh Rathode to leave TRS party
Related News