పీఎన్‌బీలో మాజీ ప్రధాని రుణం

Updated By ManamWed, 02/21/2018 - 12:00
Lal Bahadur Shastri Taken the Loan From PNB
  • రూ.5 వేల లోన్ తీసుకున్న దివంగత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి

  • ఆయన మరణానంతరం పింఛను డబ్బుతో రుణాన్ని చెల్లించిన ఆయన భార్య

Lal Bahadur Shastri Taken the Loan From PNBన్యూఢిల్లీ: దేశంలో ఇప్పుడు హాట్ టాపిక్. నీరవ్ మోదీ... పంజాబ్ నేషనల్ బ్యాంకు. ముంబైలోని పీఎన్‌బీ బ్రాడీహౌస్ శాఖకు వజ్ర వ్యాపారి నీరవ్ మోదీ రూ.11,400 కోట్లకు ఎగనామం పెట్టారు. ఈ భారీ ఆర్థిక కుంభకోణం.. బ్యాంకులు ఎంత వరకు సేఫ్ అనే చర్చకు దారి తీసింది. అయితే, భారీ ఆర్థిక మోసం జరిగిన ఆ బ్యాంకులోనే మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కూడా రుణం తీసుకున్నారన్న విషయం తెలుసు. కారు కోసం రూ.5 వేల లోన్‌ను పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి ఆయన పొందారన్న సంగతి చాలా మందికి తెలిసి ఉండదు. ఈ విషయాన్ని తాజాగా ఆయన కుమారుడు అనిల్ శాస్త్రి వెల్లడించారు. అయితే, ఆయన హఠాన్మరణం తర్వాత తన తల్లికి వచ్చిన పింఛను ద్వారా ఆ రుణాన్ని మొత్తం తిరిగి చెల్లించేశామని ఆయన చెప్పారు. ‘‘మేం చదువుకునే సెయింట్ కొలంబియా స్కూల్‌కు టోంగాలోనే వెళ్లే వాళ్లం. ఎప్పుడో ఒకసారి తప్ప ప్రైవేటు పనులకు ఆఫీసు కారును మా నాన్న వాడుకోనిచ్చేవారు కాదు. అయితే, కారు కొనాలన్న Lal Bahadur Shastri Taken the Loan From PNBడిమాండ్ మా ఇంట్లో చాలా కాలంగా ఉండేది’’ అని ఆయన ఆనాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు.

1964లో లాల్ బహదూర్ శాస్త్రి పీఏ అయిన వీఎస్ వెంకట్రామన్ కార్ల గురించి వాకబు చేశారని, ఆయన విచారణలో ఫియట్ కారు ధర రూ.12 వేలుగా తేలిందని చెప్పారు. అప్పటికి తమ బ్యాంకు ఖాతాలో రూ.7 వేలు మాత్రమే ఉన్నాయని, వెంటనే కారు కోసం పీఎన్‌బీలో రూ.5 వేల లోన్ తీసుకున్నారని అనిల్ శాస్త్రి తెలిపారు. అయితే, కారు కొన్న కొద్ది రోజులకే నాన్న చనిపోయారన్నారు.

Lal Bahadur Carభారత్-పాకిస్థాన్ 1965 యుద్ధ పరిష్కార తీర్మానంపై సంతకం చేసేందుకు తాష్కెంట్ వెళ్లిన లాల్ బహదూర్ శాస్త్రి 1966 జనవరి 11న హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ‘‘నాన్న మరణం తర్వాత కొద్ది రోజుల పాటు రుణాన్ని చెల్లించలేదు. అయితే, నాన్న మరణానంతరం అమ్మకు వచ్చే పింఛను ద్వారా ఆ రుణం మొత్తాన్ని బ్యాంకుకు తిరిగి చెల్లించాం’’ అని అనిల్ చెప్పారు. దివంగత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి చెందిన ఆ క్రీమ్ కలర్ 1964 మోడల్ ఫియట్ కారును ప్రస్తుతం.. ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ మార్గ్ 1లోగల లాల్ బహదూర్ శాస్త్రి స్మారకంలో ప్రదర్శనకు ఉంచారు.  

English Title
Former Prime Minister Taken the Loan From Crisis Tuned PNB
Related News