కొచ్చిన్ ఓడరేవులో పేలుడు: ఐదుగురు మృతి

Updated By ManamTue, 02/13/2018 - 12:23
Cochin Shipyard, Four killed, Oil tank blast

Cochin Shipyard, Four killed, Oil tank blastకొచ్చిన్: నౌకా నిర్మాణ‌ సంస్థ కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే దుర్మరణం చెందగా, 15మందికి పైగా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఓఎన్‌జీసీ డ్రిల్ షిప్ ‘సాగర్ భూషణ్’‌ నౌకలో మరమ్మత్తులు చేస్తుండగా మంగళవారం ఉదయం ఈ పేలుడు చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్య్కూ టీం ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో నౌకలో మరమ్మత్తులు చేస్తున్న సమయంలో అందులోని ఆయిల్ ట్యాంక్ పేలడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్టు పోలీసులు వెల్లడించారు. పేలుడు కారణంగా దట్టమైన పొగ వ్యాపించడంతో సహాయక చర్యలకు అటంకం ఏర్పడుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

English Title
Four killed in blast at Cochin Shipyard
Related News