సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం

Updated By ManamFri, 08/31/2018 - 09:06
Four killed, six injured in road accident in sangareddy district

road accidentసిద్ధిపేట : శుభకార్యానికి హాజరై మరికాసేపట్లో ఇంటికి చేరుకుంటామనగా వారిని మృత్యువు కబళించింది. సంగారెడ్డి జిల్లా సిద్ధిపేటలో  ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్దికుంట సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున తుఫాను వాహనం అదుపు తప్పి లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది.

ఈ దుర్ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరందరికి సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.  కాగా బాధితులు హైదరాబాద్‌ ఎస్సార్ నగర్‌కు చెందినవారుగా గుర్తించారు. కర్ణాటకలో ఓ శుభాకార్యానికి హాజరై నగరానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

English Title
Four killed, six injured in road accident in sangareddy district
Related News