తొలి జాబితాలో నలుగురు మహిళలకు చోటు

Updated By ManamThu, 09/06/2018 - 23:06
KCR

imageహైదరాబాద్ః తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అభ్యర్థుల తొలి జాబితాలో నలుగురు సిట్టింగ్ మహిళలకు చోటు దక్కింది. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, అపద్ధర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శుక్రవారం టీఆర్‌ఎస్ భవన్‌లో తొలి విడతగా 105మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. వారిలో తాజా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నుంచి గొంగిడి సుజాత, అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నుంచి రేఖానాయక్, అసిఫాబాద్ జిల్లా అసిఫాబాద్ నుంచి కోవా లక్ష్మి, మెదక్ నుంచి ఎం పద్మాదేవేందర్ రెడ్డి ఉన్నారు.

డీకే అరుణ తమ్ముడు రామ్మోహన్ రెడ్డికి టికెట్
కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్ లోకి ఫిరాయించిన మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డికి టిక్కెట్ దక్కింది. గద్వాల తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణకు రామ్మోహన్ రెడ్డి స్వయానా తమ్ముడు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి టీఆర్‌ఎస్ పార్టీలోకి ఫిరాయించారు.

రిజర్వుడు స్థానాల్లో ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరణ
టీఆర్‌ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ప్రకటించిన 105 మంది జాబితాలో  రిజర్వుడు స్థానాలకు సంబంధించి ఇద్దరు  తాజా మాజీ ఎమ్మెల్యేలకు  టికెట్లు దక్కలేదు.  ఆంధోల్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ , మంచిర్యాల జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే చెన్నూరు తాజా మాజీ ఎమ్మెల్యే  నల్లా ఓదేలుకు టికెట్ నిరాకరించారు. బాబూ మోహ న్ స్థానంలో సీనియర్ జర్నలిస్టు సి క్రాంతి కిరణ్‌ను అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు.

English Title
Four women in the first list
Related News