టు ఫ్రెండ్స్.. ట్రూ లవ్

Updated By ManamWed, 09/19/2018 - 04:25
movie

ఆనంతలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై ముళ్లగూరు లక్ష్మీదేవి సమర్పణలో ముళ్లగూరు ఆనంతరాముడు, ముళ్లగూరు రమేష్ నాయుడు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘టు ఫ్రెండ్స్’. ట్రూ లవ్ అనేది ట్యాగ్ లైన్. సూరజ్, అఖిల్ కార్తిక్, సోనియా, ఫర హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ జి.ఎల్.బి దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ విడుదల చేశారు.

image


తాను నిర్మాతనయ్యేందుకు కారకులైన నారపురెడ్డి మిత్రులు ముళ్లగూరు ఆనంతరాముడుగారు నిర్మించిన ‘టు ఫ్రెండ్స్’ ట్రైలర్ విడుదల చేసే అవకాశం లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఆయన శ్రీనివాస్ జి.ఎల్.బి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకున్నారు. నిర్మాత ముళ్లగూరు ఆనంతరాముడు మాట్లాడుతూ ‘‘విద్య, వ్యవసాయం, స్థిరాస్తి, ఫైనాన్స్ వంటి పలు రంగాల్లో విజయాలు సాధించిన నేను.. సినిమా రంగంలోనూ విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది’’ అన్నారు. దర్శకుడు శ్రీనివాస్ జి.ఎల్.బి మాట్లాడుతూ ‘‘ఖర్చుకు వెనకాడకుండా నిర్మాతలు అందించిన సహాయ సహకారాల వల్ల సినిమా బాగా వచ్చింది’’ అన్నారు.

English Title
To Friends .. True Love
Related News