స్నేహమేరా జీవితం...

Updated By ManamSun, 09/16/2018 - 00:59
mathanam

imageప్రస్తుత ప్రపంచంలో యుక్త వయసు పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో పె రిగే కాలంలో మనం లేము. పిల్లలను 6వ తరగతిలోనే వసతి గృహాలకు పం పిస్తూ ఉన్నాము. పిల్లవాడి భవిష్యత్తు బాగుండాలనే హాస్టల్లో  వేశామని తల్లి దండ్రులు గర్వంగా చెప్పుకునే రోజు లివి. పిల్లలు, తల్లి దండ్రులకు ఎంత దూరంగా ఉండి చదివితే అంత గొప్పోడుగా మారతాడని తల్లిదండ్రు ల ఆలోచన. ప్రస్తుత పోటీప్రపంచంలో పిల్లాడికి 98% మార్కులు వచ్చినా 2% మార్కులు ఎందుకు తగ్గాయో విశ్లేషణ చేసుకోవాలని సూచించే తల్లి దండ్రుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఒకప్పటి పిల్లల బాల్యంలో, ప్రస్తుతం పిల్లల బాల్యంలో, వాళ్లు పెరుగుతున్న వాతా వరణంలో చాలా మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తల్లిడండ్రు లూ మీ పిల్లల భవిష్యత్తు కోసం జరా ఆలోచించండి.

పిల్లలలో పెరుగుతున్న కొద్ది వారి లో శారీరక మార్పులు జరుగుతూ ఉం టాయి. అంతే స్థాయిలో మానసిక పరి పక్వత అభివృద్ధి జరుగుతూ ఉం టుంది. శారీరక మార్పు అనేది బయ టకు కన్పిస్తుంది. కాని మానసిక పరి పక్వత అనేది అతని చేష్టలు, మాట లు, స్పందించే తీరు, వివిధ సందర్భా లలో అతని ప్రవర్తన తీరును పరిశీలన ద్వారా తెలుసుకోవచ్చు. పిల్లల ప్రవర్త న తీరును అర్థం చేసుకోవడం ప్రస్తుత పరిస్తితులలో తల్లిదండ్రులకు చాలా కష్టంగా మారుతోంది. మారుతున్న కా లానుగుణంగా తల్లిదండ్రుల ఆలోచనా విధానాలలో మార్పు వస్తున్నప్పటికీ పిల్లల పెంపకంపై, వారి కోసం కేటా యించే సమయం శ్రద్ద తగ్గుతున్న ట్లుగా సర్వేలు ఘోషిస్త్తున్నాయి.

image


యుక్త వయసు, ప్రారంభ వయో జన వయసు చాలా అమాయకపు వ యసుగా చెప్పవచ్చు. ఈ వయసులో ఉన్న పిల్లలకు ఏదైనా విషయం అర్థం చేసుకోవడం, తెలుసుకోవాలి అనే కో రిక బలంగా ఉంటుంది. ఆ సమయం లో వారి ప్రతి అనుభవం ఎక్కువగా స్నేహితుల ద్వారానే కలుగుతూ ఉం టాయి. ఈ వయసులో పిల్లలు వారి పరిసరాల్లో ఉన్న స్నేహితు లు, వ్యక్తు లు, అంశాలతో వారి భవిష్యత్తు రూపు దిద్దబడుతుంది. 

యుక్త వయస్సు పిల్లలు ఎదుగు తున్న క్రమంలో వారి వయసున్న పిల్ల లు, స్నేహితులు ఎలాంటి పనులు చే స్తూ ఉంటారో అలాంటి పనులను చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారి ప్రవర్తనను అనుకరించడం, వారి లాగా డ్రెస్సింగ్ చేసు కోవడం, మ్యూ జిక్ వినడంలో, ప్రత్యేక మైన హీరోల సినిమాలు చూడటంలో ఆసక్తిని కనబ రుస్తూ ఉంటారు. ఒకవేళ భిన్నంగా ప్రవర్తిస్తే వారితో స్నేహం దూరం అవు తుంది అనే ఒత్తిడి కూడా ఉంటుంది. ఆ గ్రూప్ ఫ్రెండ్స్ లాగానే తను ప్రవరి ్తస్తూ ఉండాలే తప్ప తనకు వేరే మార్గం ఉండదు. స్నేహితులతో మా పిల్లవాడు చెడ్డమార్గంలో వెళ్తాడని అనే భావన కలిగే తల్లిదండ్రుల సంఖ్య గరిష్టంగానే ఉంటుంది. కాని వాస్తవా నికి అది చాలావరకు సానుకూల ప్రభావాన్నే చూపుతుందనే విషయాన్ని గుర్తించడం లేదు. యుక్తవయసు పిల్ల లు తల్లిదండ్రులతో గడిపే సమ యం కంటే ఎక్కువగా స్నేహితులతో నే గడుపుతారు. చదువుకు సంబంధిం చిన విషయాలలో ఎలాంటి సందేహ మున్న తన స్నేహితుల ద్వారానే తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. తనకు సంబంధిం చిన సందేహాలను స్నేహి తులతో స్వేచ్చగా తెలుపగలుగుతా డు. సమాజంపై అవగాహన, చదు వులో ఉత్తమ గ్రేడ్‌లను సాధించడా నికి, కొత్తకొత్త నైపుణ్యాలను అభివృద్ది చేసుకోవడానికి, తన భవిష్యతు ్తకోసం బాటలు వేసు కోవడానికి తోటి వారి సహాయం తీసుకుంటాడు.

కొన్ని సందర్భాల్లో యుక్తవయ స్సులోని పిల్లలు వాల్ల ఫ్రెండ్స్ గ్రూప్ లో ఉండడానికి మాత్రమే ప్రవర్తన, వస్త్రధారణను అనుసరిస్తూ ఉంటారు. వారికి ఇష్టం లేకపోయినా చేసే ఈ ప్రవర్తన వలన పిల్లలు తీవ్ర  ఒత్తిడికి గురవుతారు, యుక్తవయస్సులోని పిల్లలు తరచూ ఎదురయ్యే పరిస్థితులకు అతి తొందరగా ప్రతిస్పందిస్తారు. స్పందన వల్ల ఎదురయ్యే  పర్యవసానాలను పట్టించుకొనే అవకాశం తక్కువ. శోధించాలి, సాధించాలి అనే తపన ఎక్కువగా ఉండడం వల్ల చాలా సార్లు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ వయసులో ఎంత మంచి ఉంటుందో అంతకంటే తీవ్రంగా చెడ్డ పర్వవసా నాలు కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. ధూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాల వాడకం వంటి కొన్ని సామా జిక ప్రవర్తనలు, చిన్న వయస్సులోనే లైంగిక కార్యాచరణ ల్లో పాల్గొనడం వంటి వాటిని ఎక్కువగా తోటివారి ఒత్తిడి వలన ప్రయత్నిస్తారు. ఫ్రెండ్స్  చెప్పిన మాటలను వినడం, నేర్చుకో వడం అనేవి మానవ నైజం. ఈ వయసులోని  మంచిచెడుల ఆలోచనలు తక్కువగా ఉంటాయి. 

యుక్తవయసులోని పిల్లల ప్రవర్త నను తరచూ తల్లిదండ్రులు ఒక కంట కని పెడుతూ ఉండాలి. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపిస్తే స్నేహితుల మాయ లో పడిపోతారు. పిల్లలూ మంచి మార్గం కంటే ఎక్కువగా చెడుమార్గం ఎంచుకునే ప్రమాదం ఉంటుంది. యుక్తవయస్సు ప్రారంభంలోనే  సరైన రీతిలో తల్లిదండ్రుల గైడెన్స్ చేసినట్ల యితే వారు తోటివారి ఒత్తిడిని సాను కూలంగా మలుచుకోగలరు. సమస్య లను తనకు తానుగా సాధించ లేనప్పుడూ, తల్లిదండ్రులూ తమ వెం టనే ఉన్నారనే భరోసాను కల్పించాలి. సమీప వ్యక్తులే యువతరాన్ని ఎక్కు వగా ప్రభా వితం చేస్తారు. ఇతరులను ఆకర్షించడానికి  వారి ఆమోదం పొం దడానికి తప్పుడు మార్గంలో వెళ్లరా దని గుర్తుంచుకోండి. మంచి స్నేహం తో జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు

- డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి
కౌన్సెలింగ్ సైకాలజిస్ట్
9703935321

English Title
Friendship life ...
Related News