స్వర్ణం తప్పక సాధిస్తా: సింధు

Updated By ManamThu, 08/30/2018 - 22:50
sindhu
  • సింధు, సైనాలకు ఘన స్వాగతం

sindhuహైదరాబాద్: ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించకపోయినప్పటికీ రజత పతకాన్ని సాధించడం ఆనందంగా ఉందని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు చెప్పింది. 18వ ఏషియన్ గేమ్స్లో పతకాలు సాధించి హైదరాబాద్‌కు తిరిగొచ్చిన పీవీ సింధు, సైనా నెహ్వాల్‌కు ఘన స్వాగతం లభించింది. వారిద్దరికి, క్రీడా ప్రముఖులు, అభిమానులు అభినందించారు. అనంతరం గోపీ చంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వ హించిన మీడియా సమావేశంలో గోపీచంద్, సింధు, సైనా నెహ్వాల్ మాట్లాడారు. ఆసియా క్రీడల్లో ప్రతి మ్యాచ్ ప్రత్యేకంగా జరిగిందని సింధు తెలిపింది. ఫైనల్‌లో పదే పదే ఓడిపోవడం పట్ల స్పందిస్తూ.. ఫైనల్ ఫోబియా తనకు లేదని, ఫైనల్ వరకు రావడం ఎంత కష్టమో అలోచించాలని కోరారు. మున్ముందు మరింత ఎక్కువగా సాధన చేసి స్వర్ణ పతకాన్ని తప్పక సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆసియా క్రీడల్లో ఇద్దరు క్రీడాకారులు పతకాలు సాధించడం ఆనందంగా ఉందని కోచ్ గోపీచంద్ అన్నారు. ఎక్కువమంది క్రీడాకారులు మున్ముందు మరిన్ని ఎక్కువ పతకాలు సాధిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గెలుపోటములు సహజమని, ఆడిన ప్రతి మ్యాచ్‌లో గెలవడం సాధ్యం కాదని మరో క్రీడాకారిణి సైనా నెహ్వాల్ అన్నారు. మున్ముందు స్వర్ణ పతకం సాధించేందుకు శ్రమిస్తానని పేర్కొంది.

Tags
English Title
Gaining gold is Sindhu
Related News