గజల్‌కు మరోసారి చుక్కెదురు

Updated By ManamSat, 01/13/2018 - 00:07
gajal
  • మరోసారి గజల్ బెయిల్ తిరస్కరణ

  • ఈ నెల 18వ తేదీ వరకు రిమాండ్ పొడిగింపు

gajal srinivasహైదరాబాద్(మనం ప్రతినిధి): గజల్ శ్రీనివాస్‌కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. శుక్రవారం మరోసారి నాంపల్లి కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ గజల్ శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరును కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు 354, 354ఏ, 509 సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రిమాండ్‌లోనే ఉన్నారు. గజల్ శ్రీనివాస్ తరపు న్యాయవాది వినిపించిన వాదనలతో ఏకీభవించని న్యాయమూర్తి ఆయన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేశారు. ఈ నె ల 18వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. దీంతో శ్రీనివాస్‌ను తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఏ2గా ఉన్న పని మనిషి పార్వతి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

English Title
gajal srinivas bail petition once again rejected
Related News