ముమ్మాటికీ రాజకీయకక్ష సాధింపే: గండ్ర

Updated By ManamWed, 09/12/2018 - 14:47
gandra venkata ramana reddy

gandra venkataramanareddy slams on kcr governmentహైదరాబాద్ : కాంగ్రెస్ నేతలపై అపద్ధర్మ ప్రభుత్వం  కక్ష సాధింపులకు పాల్పడుతోందని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకటరమణరెడ్డి ఆరోపించారు. ఆయన బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... తనపై కేసులు పెట్టడం రాజకీయ కక్షసాధింపేనని, తన సోదరుడుని చంపుతానని రవీందర్ రావు బెదిరించారన్నారు. తన సోదరుడు ఇచ్చిన ఫిర్యాదును పక్కనపెట్టి పోలీసులు తమపైనే కేసులు పెట్టారన్నారు. 

తన ఆయుధాన్ని 2015 పరకాల పోలీస్ స్టేషన్‌లో డిపాజిట్ చేశానని, అలాగే తన తమ్ముడి వెపన్ కూడా పీఎస్‌లో అప్పగించామన్నారు. ప్రస్తుతం తమ ఇద్దరి దగ్గర ఆయుధాలు లేవన్నారు. కేసులంటూ తమను భయపెట్టి, క్యాడర్‌ను భయభ్రాంతులకు గురి చేయాలని కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే డీజీపీ కేసు పూర్వాపరాలు పరిశీలించాలని గండ్ర డిమాండ్ చేశారు.

కాగా గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సోదరుడు గండ్ర భూపాల్‌రెడ్డిలపై నిన్న రాత్రి ఆయుధ చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా కొన్ని రోజుల కిందట వ్యాపార విషయంలో గం‍డ్ర భూపాల్‌ రెడ్డి ఆయన వ్యాపార భాగస్వామి ఎర్రబెల్లి రవీందర్‌ రావుల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో తనపై తుపాకీతో దాడి చేశారంటూ రవీందర్‌ రావు, భూపాల్‌రెడ్డిలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రవీందర్‌ రావు అనుచరులు, గం‍డ్ర సోదరులు సహా వారి అనుచరులపై కూడా కేసు నమోదైంది.

English Title
gandra venkataramanareddy slams on kcr government
Related News