ఫలించిన రాయబారం.. అలకవీడిన గంటా

Updated By ManamThu, 06/21/2018 - 11:44
ganta

ganta  విశాఖపట్నం: టీడీపీ అధిష్టానంపై అలకబూనిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఎట్టకేలకు తన అలకను వీడారు. గంటాను బుజ్జగించేందుకు మంత్రి చినరాజప్ప ఈ ఉదయం అతని నివాసంకు వెళ్లి చర్చలు జరిపారు. చర్చల అనంతరం అలకవీడిన గంటా శ్రీనివాసరావు.. ఈ సాయంత్రం భీమిలిలో సీఎం పర్యటనకు హాజరు అయ్యేందుకు ఒప్పుకున్నారు. 

అనంతరం మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ.. భీమిలి నియోజకవర్గం సర్వేపై మంత్రి గంటా అసంతృప్తిగా ఉన్నారని, నిరంతరం ప్రజల్లో ఉండి పనిచేస్తుంటే, సర్వేలు ఆయనను బాధించాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో గంటా ఫోన్‌లో మాట్లాడారని, వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన భీమిలి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని చిన రాజప్ప చెప్పారు.

English Title
Ganta Srinivasa Rao breaks his silence
Related News