జీఎస్టీ సమస్యలు పరిష్కరిస్తున్నాం

Updated By ManamSat, 04/14/2018 - 22:54
GST-issues-being-addressed

GST-issues-being-addressedహైదరాబాద్: వస్తువులు, సేవల పన్ను (జి.ఎస్.టి)కి సంబంధించి ఎగుమతిదార్లు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నట్లు వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా తేవతియా చెప్పారు. భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్.ఐ.ఇ.ఓ) సభ్యులతో ఆమె ఇక్కడ సమావేశమయ్యారు. ఆ సందర్భం గా ఆమె మీడియా ప్రతినిధులతో విడిగా మా ట్లాడారు. సమావేశంలో మిగిలిన వాటన్నింటికన్నా జి.ఎస్.టికి సంబం ధించిన అంశాలే ప్రాధాన్యం వహించాయని తేవతియా చెప్పారు. ‘‘జి.ఎస్.టిని క్రమబద్ధం చేయడమే నేడు ఎగుమతిదారులందరి ప్రాధాన్యతాంశంగా ఉంది’’ అని ఆమె అన్నారు. ‘‘రానున్న నెలల్లో ఈ వ్యవస్థ కుదుటపడుతుందని మేం భావిస్తున్నాం. జి.ఎస్.టి.పై ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషి గురించి ఎగుమతిదార్లకు తెలిపి వారికి తిరిగి స్థయిర్యాన్ని చేకూర్చాం’’ అని ఆమె అన్నారు. ఈ-కామర్స్‌కు సంబంధించిన అంశాలన్నింటినీ ప్రస్తుతం అంతర్ మంత్రిత్వ శాఖల బృందం ఒకటి చర్చిస్తోందని ఆమె ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. ‘‘ఈ-కామర్స్ వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ-కామర్స్‌పై ఒక విధానం రూపొందించేం దుకు అవసరమైన మరికొన్ని అంశాలను పరిశీలించవలసి ఉంది’’ అని తేవతియా చెప్పారు. 
ఇండియా-యూరోపియన్ యూనియన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య చర్చల గురించి కూడా ఆమె ప్రస్తావించారు. ఈ చర్చల నుంచి యూరోపియన్ యూనియన్ 2012లో ఉపసంహరించుకున్నప్పటికీ, ఏదో ఒక విధంగా సంప్రదింపులు సాగుతూనే ఉన్నాయని, యూరోపియన్ యూనియన్‌ను తిరిగి చర్చలకు రప్పించాలని ఇండియా కోరుకుంటోందని తేవతియా తెలిపారు. గత రెండేళ్ళలో పరిస్థితిని సమీక్షించే సమావేశాలు సుమారుగా ఐదు జరిగాయి. భారతదేశంలో 2012 తర్వాత, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వంటి విషయాల్లో విధానపరమైన మార్పులు చాలా వచ్చాయి. దీనితో చర్చల్లో పాల్గొనే భాగస్వాముల నుంచి డిమాండ్లు తగ్గాయని ఆమె చెప్పారు. ‘‘ప్రపంచంలో అత్యంత ఉదార ఎఫ్.డి.ఐ వ్యవస్థ’’ ప్రస్తుతం భారతదేశంలోనే ఉందని ఆమె అన్నారు. లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్, లెటర్ ఆఫ్ కంఫర్ట్ సదుపాయాన్ని పునరుద్ధరించవలసిందిగా భారతీయ రిజర్వ్ బ్యాంక్‌కు నచ్చజెప్పవలసిందని ఎఫ్.ఐ.ఇ.ఓ దక్షిణాది చైర్మన్ ఎ. శక్తివేల్ వాణిజ్య శాఖను అభ్యర్థించారు. అనేక చిన్న, మధ్యతరహా సంస్థలు కూడా ఆ సదుపాయాన్ని వినియోగించుకుంటూ వస్తున్నాయని, వాటిని హఠాత్తుగా ఉపసంహరించడం వల్ల, నగదు ప్రవాహ సమస్యలు పెరిగాయని ఆయన చెప్పారు. 

Tags
English Title
Gesture problems are solving
Related News