‘ఘాజీ’కి నేషనల్ అవార్డు

Updated By ManamFri, 04/13/2018 - 12:19
Ghazi

Ghaziరానా ప్రధాన పాత్రలో సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ‘ఘాజీ’ చిత్రానికి నేషనల్ అవార్డు లభించింది. 65వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఘాజీని ఎంపిక చేశారు నిర్వాహకులు. 1971 సంవత్సరంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించగా.. అన్ని చోట్ల నుంచి విమర్శకుల ప్రశంసలు పొందింది ఈ చిత్రం. ఇక తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో కే కే మీనన్, అతిల్ కులకర్ణి, తాప్సీ పన్ను, ఓం పురి, సత్యదేవ్, రవివర్మ, ప్రియదర్శి, నాజర్ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించారు. పీవీపీ సంస్థ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కే సంగీతాన్ని అందించారు.


 

English Title
Ghazi won best regional film award in 65th National Awards
Related News