గాజుపువ్వులు

Updated By ManamFri, 03/09/2018 - 20:58
image

విత్తనం భవిష్యత్తుకు ఇచ్చే హామీ పువ్వుగా విరబూస్తుంది. మొలకెత్తడంతోనే విత్తనం కథ ముగిసిపోదు. విత్తనానికి అందమైన కొనసాగింపుగా పువ్వులు విచ్చుకుంటాయి. ప్రకృతికి రంగుల పాఠం నేర్పే గురువులుగా పువ్వులు మనుషులకు కూడా ఎన్నో పాఠాలు చెబుతాయి. ఇవాళ పూసి, రేపొద్దుటికల్లా వాడిపోయే పువ్వు మనిషి జీవితానుభవాన్ని ఒక్కరోజులో కాచివడబోస్తుంది. మనుషులుగా మనం కోల్పోయిన విలక్షణమైన, అందమైన మన అస్తిత్వం పువ్వుల్ని చూసినప్పుడు మనకు గుర్తుకు వస్తుంది. అవి మనలోని సానుకూల ప్రపంచాన్ని నిద్ర లేపుతాయి. పువ్వుల్ని అనుభూతించే కొద్దీ అవి మనలోని మనకి మరింత స్పష్టంగా బొమ్మకడతాయి. ప్రతి పువ్వుకీ తనదైన పరిమళం, రంగు ఉన్నట్టే జీవితంలోని ప్రతి మలుపుకీ తనదైన నిర్వచనం ఉంటుంది. సంతోషానికి పువ్వుల్నే బహూకరిస్తాం. విషాదానికీ పువ్వులతోనే వీడ్కోలు చెబుతాం. జీవితం పూలబాట కాకపోయినప్పటికీ మన బతుకుబాటలో పువ్వులు కాసిని నవ్వుల్ని, మరి కాసిని భావోద్వేగాల్ని వెంటబెట్టుకుని మనకు సదా తోడుగానే ఉంటున్నాయి. అందుకే ఇవాళ ‘మైత్రి’ పువ్వుల తాలూకు కొన్ని భిన్నమైన విశేషాల్ని మీముందుంచుతోంది.    - మీ మైత్రి

imageభూమ్మీద అత్యంత సున్నితమైంది పువ్వు. తాకితే కందిపోతుంది, పొద్దు వాలితే వాడిపోతుంది. అయితే భూమ్మీద అంతకన్నా సున్నితమైంది మరొకటి ఉంది. అదే గాజు. పగిలితే అతకదు. ఈ రెండింటిలోనూ ఇమిడిన ఒకే ధర్మం సున్నితత్వం. గాజుతో పువ్వుల్ని, ఆకుల్ని, రెమ్మల్ని, కొమ్మల్ని ఒకానొక అధివాస్తవిక చిత్రణలో సజీవం చేసిన ఘనత అమెరికన్ శిల్పి డేల్ చిహులీదే! గాజుతో ఎన్నెన్నో శిల్పాల్ని, ప్రతిమల్ని తయారు చేయడం మనకు తెలుసు. గాజు కళాఖండాలకు రూపమివ్వడం అంత సులభమైన విషయమేమీ కాదు. గాజుశిల్పాల చరిత్రలోనే ఒకానొక వైవిధ్యభరిత శైలికి తెరతీశారు చిహులీ. ‘బ్లోన్ గ్లాస్’ శైలిలో చిహులీ గాజు కళాఖండాల్ని రూపొందిస్తారు. ఒకానొక లోహపు గొట్టంలో మానవ శ్వాస గాజుగోళంగా రూపొందే అద్భుత శైలి అది. ఈ గాజుగోళం లేదా గాజు ముద్ద కేవలం ఇసుకతో తయారైందంటే నమ్మశక్యం కాదుimage. ఇసుకను ద్రవరూపంలోకి మార్చి, కాల్చడం ద్వారా చిహులీ అత్యంత సుందరమైన శిల్పాకృతుల్ని తయారు చేస్తారు. తన శిల్పాలకు చిహులీ ప్రకృతి నుంచి ప్రేరణను పొందుతారు. అందుకే ఆయన గాజుతో ఉద్యానవనాల్ని అవలీలగా సృష్టించి ప్రపంచాన్ని అబ్బుర పరిచారు. తన చిన్ననాటి నుంచి చిహులీకి గాజు అంటే ప్రాణం. అరవై ఒక్కేళ్ళ క్రితం తimageన ఇంట్లో స్టెయిన్డ్ గ్లాస్‌ని ఒక గొట్టంతో ఊదడం ద్వారా గాజు బుడగల్ని సృష్టించాడట ఆయన. అప్పటి నుంచి గాజుతో ఆయన రకరకాల ప్రయోగాలు చేశారు. గాజును ఒక ప్రత్యేక గొట్టం ద్వారా ఊదడం వల్ల చిత్రవిచిత్రమైన కళాఖండాల్ని సృష్టించవచ్చునని ఆయన కనిపెట్టారు. అంతవరకు గాజుతో కళాఖండాలు తయారు చేసే సంప్రదాయిక శైలి నుంచి చిహులీ మరింత విభిన్నమైన, తనదైన శైలిని సృష్టించుకున్నారు. చిహులీ వాషింగ్టన్‌లోని టకొమాలో జన్మించారు. ఎన్నెన్నో కష్టనష్టాలకు ఓర్చి తనకు ఇష్టమైన గాజుతో పనిచేయడమే జీవితలక్ష్యంగా మలచుకున్నారు. ఒకసారి 1976లో జరిగిన కారు ప్రమాదంలో ఆయన తన కంటిని పోగొట్టుకుimageన్నారు. కారు అద్దం పగిలి కంటిలో గుచ్చుకుంది. మరోసారి జరిగిన ప్రమాదంలో ఆయన భుజానికి పెద్ద గాయమైంది. దాంతో గాజు శిల్పాలు తయారు చేసేందుకు ఉపయోగించే పైప్‌ను పట్టుకోవడం అసాధ్యమైంది. అయినప్పటికీ చిహులీ వెనుకంజ వేయలేదు. చిహులీ కేవలం గాజుశిల్పి మాత్రమే కాదు. ఆయన చార్‌కోల్, యాక్రిలిక్, గ్రాఫైట్ వంటి పలు మాధ్యమాలతో పని చేయగలరు. జీవితం విసిరిన ప్రతిసవాలుకు చిహులీ గట్టి జవాబే ఇచ్చారు. లాస్ వెగాస్‌లోని బెల్లగియో హోటల్‌లో రెండువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండువేల గాజు శకలాలతో ఆయన సృష్టించిన అతిభారీ కళాఖండమే చిహులీ దీక్షకు నిదర్శనం. ప్రకృతిలో మనకు కనిపించే అనేకా వృక్షాలు, మొక్కలతో పాటు పలురకాల పుష్పాలకు కూడా ఆయన గాజుతో ప్రతిసృష్టి చేశారు. ఈయన కళాఖండాల్ని ప్రపంచవ్యాప్తంగా 200 మ్యూజియంలలో భద్రపరిచారు. సీటెల్ సెంటర్‌లో 2012 నుంచి ‘చిహులీ గార్డెన్ అండ్ గ్లాస్’ పేరిట ఆయన సృష్టించిన గాజు ఉద్యానవనం దీర్ఘకాలం ప్రదర్శితమైంది. పలు రకాల వృక్షాకృతులతో ఆయన సృష్టించిన కళాఖండాలు ప్రపంచవ్యాప్తంగా కళాభిమానుల ప్రశంసల్ని చూరగొన్నాయి.    -కల్కి
 
సుమ‘భారం
పువ్వు సౌందర్యానికి, సౌరభానికి నెలవు. మానసికోద్వేగాల్ని వ్యక్తం చేయడానికి మనం చాలా సందర్భాల్లో పువ్వుల మీదే ఆధార పడతాం. అయితే ఇక్కడ మనం చూస్తున్న పువ్వులు రూపంలో ను, సౌరభంలోను పూర్తిగా భిన్నమైనవి. అందమైన పువ్వు కోసం కొమ్మ దగ్గరికెళితే రెమ్మరెమ్మకూ పుర్రెలు వేలాడడాన్ని చూస్తే ఏమై పోతాం? అలాంటి విచిత్రమైన పువ్వుల గురించి తెలుసుకుందాం. 

snap dragonస్నాప్ డ్రాగన్
సాధారణంగా ఈ పూలను డ్రాగన్ ఫ్లవర్స్ అంటారు. ఈ మొక్క డ్రాగన్ ఆకారంలో ఉండ డమే దీనికి ఆ పేరు రావడానికి కారణం. కాగా ఈ మొక్క చనిపోయే టపుడు విత్త నాల్ని కాయల్లో వదిలి వెళుతుంది. ఈ కాయ లు చూడ్డానికి మనిషి పుర్రెల్ని పోలి ఉంటాయి.

 

 

 

 

 

హూకర్స్ లిప్ hookers lip
చూడ్డానికి అచ్చంగా దొండపండులాంటి పెదాలతో కనిపించే ఈ పువ్వు సైకోట్రియా ఎలాటా అనే వృక్ష జాతికి చెందింది. ఇది దక్షిణ, మధ్య అమెరికాల్లో పెరుగుతుంది. అయితే ఈ అధరాల ఆకృతి పువ్వు వికసించే ముందు కాసేపు మాత్రమే ఉంటుంది. హమ్మింగ్ బర్డ్స్, సీతాకోకచిలుకల వంటి వాటిని ఆకర్షించడానికే ఈ పుష్పం కాసేపు అధర సుధల్ని ఒలికిస్తూ నాటకాలాడుతుంది.

titusటైటన్ ఆరమ్
దీన్ని పువ్వులన్నిం టికీ మాతృరూపంగా భావిస్తారు. అయితే ఇది చూడడానికి లావణ్యంగా ఉండదు. మూడుమీటర్ల ఎత్తు పెరిగి, పరమ దుర్గంధాన్ని వెదజల్లుతుంది ఈ పుష్పం.

 

 

 

 

సుగంధాల క్లిక్కు
మనదేశంలో పువ్వులు లేకుండా రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. రోజూ పక్కింటి గోడ మీద నుంచి మన వాటాలోకి తొంగి చూసేimage మందారం కొమ్మని కాస్త వంచి, ఒక్క పువ్వునైనా కోసి, దేవుడి ముందు పెట్టేసి, చేతులు జోడిస్తాం. పండగ, పబ్బం అంటూ వచ్చిందా ఇక పువ్వులమ్మే పిల్ల కోసం మన కళ్ళు బజారంతా గాలించేస్తాయి. అయితే రంగుల రంగవల్లిలాంటి పూలబజారు అందుబాటులో ఉంటే ఇక మనకు పట్టపగ్గాలే ఉండవు. సత్కారాలకైనా, సత్కార్యాలకైనా పూలదండలు కొనుక్కెళ్ళి, మెడలో వేసి మన గౌరవాన్ని చాటుకుంటాం. ఇవాళైతే బారు జడలు కనుమరుగు కావడంతో సరి పోయింది కానీ, ఓ ఇరవై ఏళ్ళ క్రితమైతే ఎండాకాలం వచ్చిందంటే చాలు మల్లెపూలతో, మొగలి పూలతో అమ్మాయికి జడనల్లే హడావిడీనే వేరు!

పెళ్ళిళ్ళకీ, బారసాలలకీ, గృహప్రవేశాలకీ... అబ్బో, ఒకటేమిటి... వేడుక అంటూ ఒకటి మొదలవ్వాలే కానీ, పూల సంబరానికి కొదవేమీ ఉండదు. పూజ అంటే దేవుడి కన్నా మనకు ముందు గుర్తుకొచ్చేవి పూలే! మరి ఇన్ని అవసరాల్ని తీర్చేదీ పూలమ్మే వాళ్ళేగా! ఆసియాలోనే అతిపెద్ద పూలబజారు ఒకటి మనదేశంలో ఉంది. హుగ్లీ నదీతీరాన ఉన్న ఈ పూలబజారులో ప్రతి రోజూ రెండువేల మంది పూలమ్మే వాళ్ళు వ్యాపారం చేస్తుంటారు.

imageఅదే కోల్‌కతాలోని ‘మాలిక్ ఘాట్  ఫ్లవర్ మార్కెట్’. ఏదో పని మీద మన దేశానికి వచ్చిన డానిష్ ఫోటోగ్రాఫర్ కెన్ హెర్మన్ మాలిక్ ఘాట్ ఫ్లవర్ మార్కెట్‌కు వెళ్ళారు. అక్కడ పూలమ్మే వాళ్ళు కెన్ హెర్మన్ కెమెరాను ఆకర్షించారు. ఈయన తీసిన ఈ ఫోటోలు కేవలం వ్యక్తుల్నే కాదు, వారి జీవన శైలిని, సంస్కృతిని కూడా ఏకమొత్తంగా ప్రతిబింబించాయి. రోజూ మనకు కనిపించే పూలమ్మే వాళ్ళని యధాతథంగా చూపెడుతూనే, పూలకీ, మనుషులకీ మధ్య ఉన్న అనుబంధాన్ని కెన్‌హెర్మన్ కవితాత్మకంగా తన కెమెరాలో బంధించిన వైనం విమర్శకుల మన్ననల్ని పొందింది. ఆయన తొలుత పూలమ్మే ఆడవాళ్ళను కూడా ఫోటోలు తీయాలని ప్రయత్నిస్తే, వాళ్ళు భృకుటి ముడివేయడంతో ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడు. కఠినమైన పనులు అవలీలగా చేయగలిగే పురుషుimageలు పువ్వులతో ఎంత సున్నితంగా వ్యవహరించగలరో వీళ్ళని చూశాకే తెలిసిందంటారు కెన్ హెర్మన్.

బంతిపువ్వు లమ్మే కుల్విందర్ తన పని మానుకుని, ఎర్రటి ఎండలో తన ఫోటోలకు ఓపిగ్గా పోజులిచ్చిన వైనాన్ని అభిమానంగా గుర్తు చేసుకుంటారు ఈ ఫోటోగ్రాఫర్. తాను తీసిన ప్రతి ఫోటోకి ఆయన వీళ్ళకి ప్రతిఫలాన్ని కూడా ముట్టజెప్పా రట. రోజుకు 55 మంది పూలమ్మేవాళ్ళని ఆయన ఫోటోలు తీసే వారట. పూలమ్మే వాళ్ళు బెంగాలీ మాత్రమే మాట్లాడేవారు. దాంతో కెన్‌హెర్మన్ ఒక బెంగాలీని సహాయకునిగా నియమించుకుని, ఈ ఫోటోగ్రాఫుల్ని తీశారట. కొన్ని దేశాల్లో భారతదేశమంటే పేదరికం తాండవిస్తుంటుందన్న భావన ఉందని, కానీ తాను తీసిన ఈ ఫోటోల్ని చూసిన తరువాత ఆ అభిప్రాయం మారిపోతుందని ఆయన అంటున్నారు.

English Title
glass flowers
Related News