గోవా సీఎంగా పర్రీకరే

Updated By ManamSun, 09/23/2018 - 22:42
amith
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా స్పష్టం

ANITH-SHAHన్యూఢిల్లీ: గోవా సీఎంగా మనోహర్ పర్రీకరే కొన సాగుతారని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా స్పష్టం చేశారు. తద్వా రా అనారోగ్యంతో సీఎం బాధపడుతున్నందున ఆయన్ను మారుస్తారని వస్తున్న రాజకీయ చర్చకు తెరదించారు. అయితే.. మంత్రివర్గంలో పలు మార్పులు ఉంటాయని, శాఖల పునర్‌వ్యవస్థీకరణ తప్పదని అమిత్‌షా స్పష్టం చేశారు. గోవా బీజేపీ నేతలతో ట్విట్టర్‌లో సంభాషణ సందర్భం గా అమిత్‌షా ఈ విధంగా స్పందించారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌తో ప్రస్తు తం మనోహర్ పర్రీకర్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

అక్రమ వలసదారులను ఏరేస్తాం..
వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత.. భారతదేశంలో అక్రమంగా ఉంటున్న వలసదారులను గుర్తించాలని పార్టీ పరంగా ప్రభుత్వానికి సూచిస్తామని అమిత్‌షా తెలిపారు. ఓట్ల కోసమే అక్రమ వలసదారులపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని చెప్పారు. దేశరాజధానిలోనూ అక్రమ వలసదారులు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వారిని ఏరివేయాల్సిందేనని అన్నారు. వారిపై చర్యలు తీసుకుంటే దేశానికి ఎలాంటి నష్టం జరగదని, దేశభక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఢిల్లీలో రామ్‌లీలా మైదానాంలో జరిగిన కార్యక్రంలో ఆయన మాట్లాడుతూ..   2019లో అధికారంలోకి రాగానే అక్రమ వలసదారుల గుర్తింపు ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. కాగా, రెండు రోజుల క్రితం రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్‌షా.. బంగ్లాదేశీ వలసదారులు చెదల వంటి వారని అభివర్ణించిన విషయం తెలిసిందే. అసోంలో చేపట్టిన ఎన్‌ఆర్‌సీ సర్వే ద్వారా 40 లక్షల మంది అక్రమ వలసదారులు ఉన్నట్లుగా తేలిందని, వారందూ కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుగా ఉన్నారని అన్నారు. వారందరినీ వెనక్కి పంపిస్తామని చెప్పారు.

English Title
Goa CM Perikare
Related News