పోలవరం పనులకు అడ్డంకిగా గోదారి వరద

Updated By ManamTue, 08/21/2018 - 13:42
godavari flood water
godavari flood water

ఏలూరు : గోదావరి వరద నీరు పోలవరం ప్రాజెక్ట పనులకు అడ్డంకిగా మారింది. ప్రాజెక్ట్ స్పిల్‌వేలోకి వరద నీరు ప్రవేశిస్తోంది.  సింగన్నపల్లి, గంగాలమ్మ కాలువ నుంచి వరద నీరు ముంపు గ్రామం చేగొండపల్లిని తాకి అక్కడ నుంచి ప్రాజెక్ట్‌లోకి వస్తోంది. దీంతో వరద నీరు లోపలికి రాకుండా నవయుగ కంపెనీ సిబ్బంది ఎత్తుగా మట్టి కట్టడం నిర్మిస్తున్నారు. అయితే గట్టు దాటితే ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుకునే అవకాశం ఉంది.

మరోవైపు జిల్లాలో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో పలువురు నేతలు పర్యటించారు. చింతలపూడి ఎమ్మెల్యే, మాజీమంత్రి పీతల సుజాత మంగళవారం జంగారెడ్డిగూడెంలో ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అలాగే ఎంపీ మురళీమోహన్, జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ తదితరులు నల్లజర్ల మండలంలో వరద బాధితుల్ని పరామర్శించారు. అయితే వరద నీటిలో చిక్కుకున్న తమకు సాయం అందటం లేదంటూ పలుచోట్ల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

English Title
Godavari flood water obstacle to Polavaram project works
Related News