ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..

Updated By ManamThu, 08/09/2018 - 20:44
Jr NTR, Director Trivikram, Aravindha Sametha,  Young tiger, first look of Jr NTR, New Teaser release

Jr NTR, Director Trivikram, Aravindha Sametha,  Young tiger, first look of Jr NTR, New Teaser releaseయంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ త్వరలో ఓ టీజర్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర బృందం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘చివరకు మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్త. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ‘అరవిందసమేత’ టీజర్‌ను ఆగస్టు 15న విడుదల చేయనున్నాం. సమయాన్ని త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్ర నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్‌ పేర్కొంది. ఈ చిత్రంలో తారక్‌ సరసన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్రానికి సంబంధించి కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. 

15 రోజులకు పైగా ఈ చిత్రం షెడ్యూల్‌ షూటింగ్ ఇక్కడే సాగనుంది. అనంతరం పొలాచ్చిలో తదుపరి చిత్ర షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అదే యాసలో తారక్‌ డైలాగ్‌లు ఉండనున్నాయి. రాయలసీమ యాసలో తారక్ చెప్పే డైలాగ్‌లు అభిమానులు సహా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ అభిప్రాయపడుతోంది. వెండితెరపై మరోసారి తారక్.. తన సిక్స్‌ ప్యాక్‌తో మెరవనున్నారు. ఈ చిత్రం కోసం తారక్.. చాలా రోజుల నుంచి నిపుణుల సమక్షంలో శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే. దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకోచ్చే యోచనలో చిత్రబృందం ఉంది. 

English Title
Good News for Jr NTR fans 
Related News