వాహనదారులకు శుభవార్త

Updated By ManamTue, 08/28/2018 - 05:31
akun
  • ఇంధనం కనిపించేవిధంగా పెట్రోల్ బంకు యజమానులకు,
    అధికారులకు గ్లాస్ పరికరాలు వినియోగం    

imageహైదరాబాద్: తెలంగాణ వాహనదారులకు ఇది శుభవార్తే. ఇకనుంచి ఇందనం కనిపించెవిదంగా పెట్రోల్ బంకు యజమానులకు, అధికారులకు గ్లాస్ పరికరాలు వినియోగించనున్నారు. తనిఖీలప్పుడు.. పారదర్శకత జవాబుదారీపై తూకంలో 5 లీటర్ల జార్‌తో నాణ్యత పరీక్షలు చూపాలని తెలంగాణ తూనికలు కోలతలు శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్  స్పష్టంచేశారు. నాణ్యతలో పారదర్శకతే లక్ష ్యంగా..ఇందన తూకానికి. .ప్రత్యేకంగా రూపొందించిన 5 లీటర్ల గ్లాస్ జార్‌ను త్వరలో తెలంగాణలో వినియోగంలోకి రానుంది. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజీల్ కొలతల్లో నాణ్యతల పరీక్షలు మరింత పారదర్శకంగా ఉండేలా తూనికల కొలతల శాఖ సన్నాహాలు చేస్తోంది. తనిఖీల సమయంలో వినియోగదారులకు, పెట్రోల్ బంకు యజమానులకు, అధికారులకు స్పష్టంగా కనిపించే విధంగా గ్లాస్‌తో చేసిన పరికరాన్ని అందుబాటులోకి తెస్తోంది.

తనిఖీలో పారదర్శకతను, జవాబు దారీతనాన్ని పెంపొందించేందుకు, తూకం, నాణ్యతలను తనిఖీ చేయడానికి గ్లాస్తో తయారు చేసిన 5 లీటర్ల జార్ను ప్రవేశపెడుతోంది. నాణ్యత, తూకం పరీక్షలు చేసేందుకు ప్రస్తుతం రాగితో చేసిన 5 లీటర్ల జార్ను ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ జార్లో టెంపరేచర్, హ్యాండ్లింగ్ల వల్ల తనిఖీల సమయంలో వేరియేషన్ (సరైన తూకం) కొన్ని సందర్భాల్లో తేడా వస్తోంది. కొత్తగా గ్లాస్‌తో చేసిన ఐదు లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ పెట్రోలియం గ్లాస్ జార్‌తో వంద శాతం తూకంతో ఏ మాత్రం తేడా ఆస్కారం ఉండదు. ఈ గ్లాస్ జార్ నాణ్యమైన యుఎస్పి టైప్ క్లాస్-ఎతో తయారు చేబడింది. అందులో పోసే ఇంధనం స్పష్టంగా కనబడడంతో పాటు సరైన తూకాన్ని సూచిస్తుంది.

 అలాగే ఈ జార్లో ఎలాంటి మాన్యుపులేషన్ చేయడానికి అవకాశం ఉండదు. గ్రేటర్ హైదరాబాద్ పెట్రోల్ అండ్ డీజిల్ డీలర్స్ అసోసియేషన్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ ఆయిల్ కంపెనీలతో సోమవారం పౌరసరఫరాల భవన్‌లో జరిగిన సమావేశంలో ఈ నూతన పరికరాన్ని తూనికల కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ పరిశీలించారు. ఈ నూతన యంత్రాలను ఆయా పెట్రోల్ బంక్ యాజమాన్యాలే సమకూర్చుకోవాలని కంట్రోలర్ సూచించారు. అయితే, వీటికి తూనికల కొలతల శాఖ అధికారుల నుంచి కచ్చితంగా ధృవీకరణ పత్రం పొందవలసి ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ పెట్రోల్, డీజిల్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజివ్ అమరం, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి అమరేందర్ రెడ్డి, హెచ్‌పీసీఎల్ డిజిఎం (రిటేల్) రాజేశ్, బీపీసీఎల్ మేనేజర్ టి. శ్రావణ్ పాల్గొన్నారు. 

English Title
Good news for motorists
Related News