మూడు బ్యాంక్‌ల విలీనంతో మేలు

Updated By ManamWed, 09/19/2018 - 00:23
Arun-Jaitley

Arun-Jaitleyన్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీనం వల్ల సామర్థ్యం, పాలన మెరుగుపడే అవకాశం ఉన్నందున అది ‘క్రెడిట్ పాజిటివ్’ అవుతుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ మంగళవారం పేర్కొంది. రుణాల మంజూరు, ఆర్థిక వృద్ధిని పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా ఆ మూడు బ్యాంకులను విలీనం చేయాలని ప్రభు త్వం సోమవారం ప్రతిపాదించింది. ఆ మూడు బ్యాంకులు ఒకటైతే దేశంలో మూడవ అతి పెద్ద బ్యాంక్ అవతరించినట్లవు తుంది. విలీనం ద్వారా ఏర్పడే బ్యాంక్ రుణాల రీత్యా సుమారు 6.8 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంటుంది. ‘‘విలీనంతో ఏర్పడే సంస్థకు ప్రభుత్వం నుంచి మూలధన మద్దతు అవసరమవుతుంది. లేకపోతే, కేవలం అటువంటి విలీనం వల్ల వాటి మూలధన స్థితిగతులు ఏమీ మెరుగుపడవు’’ అని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ (ఫినాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ గ్రూప్) ఉపాధ్యక్షుడు అల్కా అన్బరసు అన్నారు. ఆస్తుల నాణ్యత, మూలధనీకరణ, లాభదాయకత మూడు అంశాల్లోనూ దేనా బ్యాంక్‌కన్నా బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంక్‌ల పరిస్థితి మెరుగ్గా ఉంది. ఆర్థిక మంత్రి అరుణ్  జైట్లీ నేతృత్వంలోని మంత్రిత్వ స్థాయి కమిటీ ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ మూడు బ్యాంక్‌లను విలీనం చేయాలన్న నిర్ణయాన్ని తీసుకుంది.  విలీన ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసేందుకు ఆ బ్యాంకుల బోర్డులు వేర్వేరుగా సమావేశమవుతాయి.

English Title
Good for three banks mergers
Related News