ఓ మంచి పని కోసం...

Updated By ManamSun, 09/02/2018 - 01:36
samantha

imageదక్షిణాదిలో హీరోయిన్‌గా చాలా మంచి పేరు తెచ్చుకున్న సమంత నటిగానే కాదు సమాజ సేవ చేయడంలోనూ మంచి పేరు తెచ్చు కుంటున్నారు. ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారులకు శస్త్రచికిత్స చేయించేందుకు నిధులను సేకరిస్తున్నారు. అందులో భాగంగా చెన్నయ్ వెళ్ళిన సమంత ట్రిప్లికేన్‌లోని జామబజార్ వెళ్ళారు.

అక్కడ రోడ్డు పక్కనే ఉన్న ఓ కూరగాయల దుకాణం యజimageమానికి విషయం చెప్పారు. అకస్మాత్తుగా కూరగాయల దుకాణంలో సమంత ప్రత్యక్షం కావడంతో జనం ఆ షాపు చుట్టూ గుమిగూడారు. అక్కడికి వచ్చినవారికి ఏమేం కావాలో కనుక్కొని కూరగాయలు అమ్మడం మొదలుపెట్టారు. పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి అందరూ కూరగాయలు కొనుకోలు చేశారు. నిమిషాల వ్యవధిలో షాపులోని కూరగాయలన్నీ అయిపోయాయి.

English Title
For a good work ...
Related News